ఆరోగ్యం వైపు నడుద్దాం
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు.. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయి. నిండైన జీవితాన్ని గడిపేందుకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం ఓ లక్షణం. ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ప్రధానం. క్రీడలు ఆరోగ్యంతో పాటు క్రమ శిక్షణను అలవరుస్తాయి.
- నడక శరీరానికి ఎంతో మేలు
- ఆట… ఆరోగ్యానికి పూదోట
- పతకాల కోసం లక్ష్యం కారాదు
- సంపూర్ణ ఆరోగ్యానికీ క్రీడలు ఆవశ్యం
జహీరాబాద్, నవంబర్ 23: ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు.. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయి. నిండైన జీవితాన్ని గడిపేందుకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం ఓ లక్షణం. ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ప్రధానం. క్రీడలు ఆరోగ్యంతో పాటు క్రమ శిక్షణను అలవరుస్తాయి. క్రీడలు పోటీతత్వాన్ని పెంచి కష్టాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. క్రీడల్లో పాల్గొనడం తప్పనిసరని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. పతకాలు సాధించడమనేది ఆటల పరమావధికాదు. చక్కని ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరం.
ఈత ఆరోగ్యానికి మార్గం..
ఒకప్పుడు ఈత మనుషుల రోజువారీ అలవాటుల్లో ఒకటిగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఈత కాలక్షేపంగా మారింది. ఈత చక్కని ఆరోగ్యానికి మంచి సాధనం. నీటిలో తేలుతూ కాళ్లూచేతులు బాగా కొట్టడం ద్వారా శరీర భాగాల మధ్య కదలికలు సక్రమంగా జరుగుతాయి. ఈత కొట్టడం ద్వారా అధిక కెలరీలు శక్తి ఖర్చులు శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఆరోగ్య సమతుల్యాన్ని కాపాడుకోవచ్చు. చక్కని దేహదారుఢ్యంతో శరీరాకృతిని పొందవచ్చు. ఆరోగ్యపరంగా రక్తపోటు తగ్గించవచ్చు. ఊపిరితిత్తులకు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. కాళ్ల కండరాల మధ్య ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
నడక శరీరానికి ఎంతో మేలు..
ప్రతిరోజు నడకతో మేలు జరుగుతుంది. ఉదయం, సాయంత్రం నడిస్తే ఔషధంగా పని చేస్తుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. అధిక బరువున్న ఓ మనిషి రోజుకు పదివేల సార్లు మెట్లెక్కడం, దిగడం ఒక నెలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గుండెపోటు మధుమేహం ఒత్తిడి అధికంగా ఉన్న వారికి నడక మంచి సాధనం. ఉదయం సాయంత్రం వేళల్లో నడవడం ఆరోగ్యానికి మంచిది. షూస్‌తో నడవడం ఉత్తమ పద్ధతి. సాధారణంగా నడిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. నడిచేటప్పుడు ఐదు నిముషాల పాటు నెమ్మదిగా ప్రారంభించి తర్వాత చెమటలు పట్టేంత వేగంగా నడవడం ఉత్తమం.
యోగాతో చక్కని ఆరోగ్యం
ప్రతిరోజూ యోగా చేయడంతో చక్క ని ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఓ ప్రత్యేక క్రీడ. పసిడి పతకాలు కాదు ఆటకు అర్థం. ఇంద్రియ, జ్ఞానేంద్రియ వృద్ధి యోగా లక్షణం. యోగా అభ్యసనం ద్వారా శారీరకంగా చక్కని శీరీర సౌష్టవం సాధ్యం. కండరాల పట్టుత్వం మోకాళ్ల, పిక్కల్లో దోషాలు నివారించవచ్చు. మానసింగా నాడీమండల వ్యవ స్థ సమతులంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది. ధైర్యం గ్రహణ శక్తి అభివృద్ది చెందుతుంది. కష్ట సమయాల్లో భయపడని నిశ్చలత్వం వస్తుంది. ఆరోగ్యపరంగా లాభాలను చూస్తే శరీరంలోనీ అన్ని భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నాడుల్లో శక్తి పెరుగుతుంది. చక్కని నియమనిష్టలతో యోగాభ్యాసన చేయడంతో నిర్ణీత కాలంలోనే శారీరక రుగ్మతలకు దూరం కావచ్చునని యోగా గురువులుఅభిప్రాయపడుతున్నారు.
పరుగుతో అతిబరువుకు దూరం
చిన్నప్పుడు పరుగులు తీయడంలో ఉత్సాహంగా కనిపించే పిల్లలు పెద్దయ్యాక పరుగంటేనే భయపడుతున్నారు. పరుగులో ఉన్న లాభాలను తెలుసుకుంటే ఆ పరుగును జీవితాంతం ఆపరు. నాజూకుగా ఉండాలనుకునే నారీమణులకు పరుగు ఒక వరం. పరుగుతీయడం ద్వారా శరీరంలోని చెమట బయటకు ప్రసరించి ముఖం కాంతివంతమవుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు తక్కువ సమయంలో తగ్గేందుకు ఉత్తమ మార్గం పరుగేనని వైద్యులు తెలుపుతున్నారు. రోజుకు సగటున ఒక మైలు పరుగెత్తితే సుమారు వంద క్వాలరీల దాకా శక్తి ఖర్చవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారికి శ్వాస క్రియ రేటును 50 శాతం దాకా పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు తక్కువ వేగంతో పరుగెత్తడం ఉత్తమం. శరీరం దృఢంగా అవుతుంది. మానసికాభివృద్ధి కలిగి తేజోవంతులుగా మారవచ్చు.
క్రీడలతో పోటీతత్వం

మానవుడు సంఘజీవి. కాలంతో పోటీ పడకుంటే సమాజంలో బతకలేడు. కొండంత లక్ష్యమైనా జడవక ఎదురొడ్డి నిలిచే సామర్థ్యాలను పోరాట పటిమను ప్రేరేపిస్తాయి క్రీడలు. మనిషి బతకడానికి పోరాటమనే స్ఫూర్తి అవసరం. పోరాట స్ఫూర్తి లేకుంటే మనిషి జీవితం అర్థంలేనిది. మైదానంలో పాదరసంలా పనిచేసే సామర్థ్యాన్ని పెంచే క్రీడలు అనేకం ఉన్నాయి. దేని ప్రత్యేకలు వాటికి ఉన్నా, గ్రామీణ ఆటలైన కబడ్డీ, హాకీ, ఖోఖో క్రీడలు ఉత్కంఠ కలిగించేవి. మైదాన రంగంలో పాదరసంలా కదులుతూ విజయం వైపు ప్రోద్బలాన్ని పెంచుతాయి. మైదానంలో ఆటలాడే సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు చూపించే చొరవ జీవిత సమస్యలను పరిష్కరించడానికి మార్గంలా పని చేస్తాయి. ఉత్కంఠను రేపే ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా నిర్ణయాలు వేగవంతంగా తీసుకునే అలవాటుతో పాటు వ్యక్తిత్వం అలవడుతుంది. జీవితంలో గెలుపోటములు సహజం. క్రీడాస్ఫూర్తి ఉంటేనే జీవితంలో ముందుకెళ్లగలం. క్రీడలు బాధలను తట్టుకునే మనోనిబ్బరాన్ని కలిగిస్తాయి. మంచి ప్రవర్తనను అలవాటు చేస్తాయి.
జిమ్‌తో ఆరోగ్యంగా..

మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ ఒక గంట జిమ్ చేసేందుకు సమయం కేటాయించాలి. వ్యాయామం చేసేందుకు వయస్సుతో సంబంధం లేదు. చక్కని ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేసేందుకు అనువైన సమయం ఎంపిక చేసుకోవచ్చు.
– సలీం, జిమ్ కోచ్, జహీరాబాద్
ఆరోగ్యానికి క్రీడలు, నడక అవసరం
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, నడక అవసరం. శారీరక వికాసంతోనే మానసిక ఆనందం సాధ్యమవుతుంది. రోజులో గంటసేపైనా క్రీడలు, నడకకు ప్రాధాన్యతనివ్వాలి. క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరం.
– కే. సంపత్‌కుమార్, క్రికెట్ కోచ్, జహీరాబాద్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

