Siddipet | లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
ప్రజలను మభ్యపెట్టే వారిపై క్రిమినల్ కేసులు : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి

సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13 : జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, వేగంగా చేపట్టి ఆ వివరాలను తనకు అందించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై రెవెన్యూ డివిజన్ అధికారులు, రహదారులు, భవనాలు, ఈడబ్ల్యూడీసీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ పర్యవేక్షక, కార్యనిర్వహక ఇంజనీర్లు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లకు ఐడీఓసీలో సమావేశం నిర్వహించి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో డబుల్ బెడ్రూం స్కీమ్ కింద 15,929 ఇండ్లు మంజూరు కాగా 1,386 ఇండ్లు మినహా అన్ని ఇండ్లు పూర్తయ్యాయన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన వాటికి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో డబుల్ రూంలకు సంబంధించి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ నోడల్ అధికారి వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్లు మండలంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగిన అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ఇది వరకే గృహ ప్రవేశాలు జరిగిన ఇండ్లలో ఎవరు ఉంటున్నారు.. కుటుంబ సభ్యుల సంఖ్య, ఆధార్ వివరాలు, కులం వంటి వివరాలు సేకరించి ఆర్డీవో ద్వారా ఆ వివరాలు తనకు వారంలో అందజేయాలన్నారు. అలాగే అన్ని మౌలిక సదుపాయాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇండ్లు, పూర్తి కాబడి మౌలిక సదుపాయాల కల్పన పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూంలకు లబ్ధిదారుల ఎంపిక వచ్చే 3 వారాల్లో పూర్తి చేయాలన్నారు.
మొదటి, రెండు సార్లు లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుల్లో ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తరువాతే మూడో విడుతగా ఫైనల్ లబ్ధిదారుల జాబితాను ప్రచురించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మధ్య దశలో ఉన్న ఇండ్లకు సంబంధించి ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణకు ఒక వారం, మరో వారం క్షేత్ర పరిశీలనకు కేటాయించాలన్నారు. క్షేత్ర పరిశీలన, బిగ్ డేటాతో వడపోత చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆర్డీవోలు ప్రధాన బాధ్యత వహించాలన్నారు. వచ్చే 15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలన్నారు. ఇక నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై సంబంధిత అధికారుల అందరితో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమగ్ర సమీక్ష ఉంటుందన్నారు. అప్పటికల్లా అధికారులు తమ పరిధిలోని అన్ని డబుల్ బెడ్రూం సైట్లను సందర్శించాలన్నారు.
- మూడు వారాల్లో గజ్వేల్, దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి
వచ్చే మూడు వారాల్లో గజ్వేల్, దుబ్బాకలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం పూర్తయిన 1248 డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల నుంచి 3512 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రామ్‌గోపాల్‌రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, జిల్లా పశు సంవర్ధక అధికారి సత్యప్రసాద్, గజ్వేల్ ఆర్డీవో విజేందర్‌రెడ్డి దరఖాస్తుదారుల ఇంటింటా సర్వే, విచారణ చేపట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం పూర్తి కాబడిన 1135 ఇండ్లకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన 20 వార్డుల నుంచి 1680 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, ఆర్డీవో అనంతరెడ్డి, డీఆర్డీవో గోపాల్‌రావు, సీడీపీవో జరీనాబేగం దరఖాస్తుదారుల ఇంటింటా సర్వే, విచారణ చేపట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా వచ్చే 3 వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. - పైరవీకారులు తస్మాత్ జాగ్రత్త
- ప్రజలను మభ్యపెడితే జైలే గతి
గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇండ్లు లేని నిరుపేద అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా నియమించబడ్డ జిల్లా అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటా సర్వే, విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చేలా చేస్తామని పేదలను మభ్యపెట్టినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే దళారుల పై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. - డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా చేపడుతున్నామని, ప్రజలు ప్రభుత్వం, అధికారులపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ, క్షేత్ర సర్వే తరువాతనే లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రజాప్రతినిధుల సమక్షంలో గృహ ప్రవేశాలు చేపడుతామని స్పష్టం చేశారు.
- నిర్వాసితులు ఇండ్లు కట్టుకొని ఖాళీ చేశాకే లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేస్తాం
మల్లన్నసాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా ములుగు, సంగాపూర్ తదితర డబుల్ బెడ్రూం ఇండ్లలో తాత్కాలిక వసతి కల్పించామని కలెక్టర్ తెలిపారు. వారంలో నిర్వాసితులకు ప్లాట్లను కేటాయిస్తామని తెలిపారు. నిర్వాసితులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి కేటాయించిన ప్లాట్లలో ఇండ్లు కట్టుకొని వాటిలోకి వెళ్లాకనే లబ్ధిదారులకు నిర్వాసితులు ఖాళీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. - డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు ముందు ఇండ్ల సైట్లలో ఉపాధి హామీ పథకం కింద మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు ల్యాండ్ ఫిల్లింగ్, ప్లాంటేషన్ పనులు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీ గ్రీన్ బడ్జెట్ కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఈ పనులను తహసీల్దార్లు సమన్వయం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

