విద్య, వ్యాపార కేంద్రంగా సిద్దిపేట
సిద్దిపేట నేడు విద్య, వైద్యం సాగునీరు, వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెడరల్ బ్యాంక్ సిద్దిపేటకు రావడం శుభసూచకమన్నారు.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు… సిద్దిపేటలో ఫెడరల్ బ్యాంక్ ప్రారంభం
సిద్దిపేట, డిసెంబర్ 28: సిద్దిపేట నేడు విద్య, వైద్యం సాగునీరు, వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెడరల్ బ్యాంక్ సిద్దిపేటకు రావడం శుభసూచకమన్నారు. సిద్దిపేటలో అన్ని బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాలో 144 బ్రాంచీలు, 32 రకాల బ్యాంక్‌లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. పట్టణంలోనే వివిధ బ్యాంక్‌లకు చెందిన 50 బ్రాంచీలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
రూ.12 వేల కోట్ల వ్యాపారంతో సిద్దిపేట రూ.7కోట్ల వరకు బ్యాంక్ లోన్స్, రూ.5కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయన్నారు. ఎస్బీఐ 7 బ్రాంచీలు, యూబీఐ 7 బ్రాంచీలు వచ్చాయన్నారు. అంతకుముందు సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ కూతురు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. సిద్దిపేట బైపాస్ రోడ్డు హరీశ్రావునగర్లో గల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నవగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని పూజలు నిర్వహించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

