గ్రామంలో బతకాలా.. చావాలా
ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మళ్లీ గ్రామ శివారులో డంప్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
- విష వాయువులతో బతకలేక పోతున్నాం
- ఇప్పుడు డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తారా..
- అడ్డుకున్న గుండ్లమాచునూర్ గ్రామస్తులు
- మంత్రి కార్యక్రమాన్ని రద్దుచేసిన అధికారులు
హత్నూర, జూలై 23 : ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మళ్లీ గ్రామ శివారులో డంప్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నా యి… పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఘాటైన పొగమం చు, వాయుకాలుష్యంతో గుండ్లమాచునూర్ గ్రామస్తులు జబ్బులకు గురవుతున్నారు. దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. వాయుకాలుష్యం బాధలు భరించలేక కొంతమం ది గ్రామస్తులు ఊరువిడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్నారు. ఇది చాలదు అన్నట్లుగా అధికారులు గ్రామసమీపంలో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
గండ్లమాచునూర్ సమీపంలోని కందిమండలం ఆరుట్ల గ్రామశివారులో సర్వే నెంబర్ 133లో సంగారెడ్డి మున్సిపాలిటీ చెత్త నిల్వకోసం అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు. నేలను చదునుచేసి మంత్రి దామోదర రాజనరసింహ చేతులమీదుగా మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం పనులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. మంగళవారం ఉదయం కంది, హత్నూర మండలాల తహసీల్దార్లతో పాటు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్, పోలీసు సిబ్బంది గుండ్లమాచునూర్ గ్రామానికి చేరుకొని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామశివారులోని రసాయన పరిశ్రమలతో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ గ్రామంలో ఉండలేకపోతున్నామని, ఇక డంపింగ్‌యార్డు నిర్మాణం చేపడితే గ్రామంలో ఎలా బతకాలని ప్రశ్నించారు. రసాయన పరిశ్రమలు విడుదలచేసే విషపూరిత కాలుష్యం భరించలేక కొన్ని కుటుంబాలు గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయని, ఇక మమ్మల్ని కూడా వెళ్లిపొమ్మంటారా లేక చావమంటారా ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో చేసేది ఏమిలేక వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
డంపింగ్‌యార్డును అడ్డుకుంటాం..
గ్రామ సమీపంలో డంపింగ్‌యార్డు ఏర్పాటును గ్రామస్తులు అందరం కలిసి అడ్డుకున్నాం. 15 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకువచ్చి మాగ్రామ సమీపంలో చెత్తవేయాల్సిన అవసరం ఏముంది. సంగారెడ్డి మున్సిపాలిటీ చెత్తను సంగారెడ్డి సమీపంలోనే వేయాలి తప్ప ఇతర గ్రామాలకు ఇబ్బంది కలిగేలా చూడటం పద్దతికాదు. ఇప్పటికే విషపూరిత వాయుకాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎట్టి పరిస్థితిల్లో డంప్‌యార్డును ఏర్పాటు చేయనివ్వం.
-బేగరి యాదగిరి, మాజీ వార్డుమెంబర్, గుండ్లమాచునూర్
ఇక చావా శరణ్యం..
మాగ్రామంలో ఇప్పటికే పరిశ్రమలు విడుదల చేస్తున్న విషపూరిత కాలుష్యంతో రోగాల బారినపడుతున్నాం. ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యానికి గురై దవాఖానల చుట్టూ తిరుగుతున్నాం. ఘాటైన వాసన భరించ లేకపోతున్నాం. మా సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ చెత్తను తీసుకువచ్చి గ్రామ సమీపంలో వేయడానికి అధికారులు చర్యలు తీసుకోవడం బాధ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు కానివ్వం.
-శ్రీశైలం, గుండ్లమాచునూర్, గ్రామ యువకుడు
వేరేచోట ఏర్పాటు చేసుకోవాలి..
సంగారెడ్డి మున్సిపాలిటి చెత్తను తీసుకువచ్చి మాగ్రామ సమీపంలో పారబోసే చర్యను అధికారులు మానుకోవాలి. డంపింగ్ యార్డు వేరేచోట ఏర్పాటు చేయాలి. డంపింగ్ యార్డు ఏర్పాటుచేస్తే రెండుగ్రామాల ప్రజలం ఇబ్బందులు ఎదుర్కొంటాం. అధికారులు పునరాలోచన చేసి డంపింగ్ యార్డు ఏర్పాటును మానుకోవాలి. లేనిపక్షంలో రెండుగ్రామాల ప్రజలు అందరం కలిసి నిరవధిక ఆందోళనకు వెనుకాడం.
-నరసింహారెడ్డి,మాజీ ఉప సర్పంచ్, గుండ్లమాచునూర్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

