పాపన్నపేట,సెప్టెంబర్ 29 : మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బాధిత కుటుంబాలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. ముందుగా గాంధారిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు పాశం అంజిరెడ్డి తండ్రి పాశం నాగిరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగిరెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం జయపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన దాసరి కేశయ్య కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. యూసుఫ్‌పేట గ్రామంలో చామంతుల నారాయణ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుర్తివాడ గ్రామంలో ఏడుపాయల మాజీ డైరెక్టర్ మోహనరావు అత్తమ్మ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్త పుట్టి మల్లేశం మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వీరి వెంటపాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు జగన్, సర్పంచ్ సాయిరెడ్డి,మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షులు వడ్ల కుబేరుడు,మాజీ సర్పంచ్ లు లింగారెడ్డి,బద్రి.మల్లేశం, శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి,నాయకులు కిష్టగౌడ్,ఆంథోనీ,అనిల్ రెడ్డి,మల్లేశం, విశ్వాసం రెడ్డి, రఘుపతి,మన్నే వెంకటేశం, సిద్దిరామ్ రెడ్డి,ఆయా గ్రామాలకు చెందిన కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.