సిద్దిపేట, ఫిబ్రవరి18: సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం పలు వివాహాలకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ రాజిరెడ్డి కూతురు, వీఎస్ఎస్ కన్వెన్షన్హాల్లో జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ పాతూరి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి పెండ్లికి, బైరి అంజయ్య గార్డెన్లో జరిగిన నంగునూర్ మండలం రాంపూర్ ఎంపీటీసీ నితిన్, దేవీగార్డెన్లో జరిగిన పార్టీ సీనియర్ నాయకులు బీడ రాయుడు కూతురు, మొకిడి నర్సింహగార్డెన్, పటేల్ గార్డెన్, లింగారెడ్డిపల్లి ముదిరాజ్ ఫంక్షన్‌హాల్ , సీసీగార్డెన్, పద్మనాయక ఫంక్షన్‌హాల్, పద్మశాలీభవన్‌లో జరిగిన వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, నాయకులు ఉన్నారు.