RTC Bus | బస్సులు తక్కువ, ప్రయాణికులు ఎక్కువ..! ప్రమాదమని ప్రయాణం
సిద్ధిపేట జిల్లా గజ్వేల్–రాయపోల్, దౌల్తాబాద్-రామాయంపేట మార్గంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాయపోల్, నవంబర్ 05 : సిద్ధిపేట జిల్లా గజ్వేల్–రాయపోల్, దౌల్తాబాద్-రామాయంపేట మార్గంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుండగా, అందుకు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బస్సుల్లో నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులు ఎక్కుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
Ramayana | ‘రామాయణ’ అద్భుతంగా ఉంది.. ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసల వర్షం!
Y.S. Jagan | చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో లబ్ధి : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

