సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం.. గౌరవెల్లి పాత చెరువుకు గండి
సిద్దిపేట| సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానకు అక్కన్నపేట మండలం గౌరవెల్లి పాత చెరువుకు గండి పడింది. ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని ఇండ్లు నీటమునిగాయి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానకు అక్కన్నపేట మండలం గౌరవెల్లి పాత చెరువుకు గండి పడింది. ఒక్కసారిగా నీరు రావడంతో సమీపంలోని ఇండ్లు నీటమునిగాయి, గ్రామంలోని పంట పొలాలు, రహదారిపై నీరు ప్రవహిస్తున్నది.

బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సిద్దిపేట-హనుమకొండ రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. ఈనేపథ్యంలో రాకపోకలు స్తంభించాయి. వరదలో ఓ లారీ చిక్కుకుపోయింది. స్థానికులు లారీ డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

నంగునూరు మండలం అక్కెనపల్లి వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కరీమాబాద్, సాకరిశికుంట, ఏకశిలానగర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వర్షం కురుస్తున్నది.
నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిడమనూరు మండలం ముప్పారం వాగు దగ్గర వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

