Harish Rao | తండ్రిని కోల్పోయిన చిన్నారి సాత్విక కు బాసటగా నిలిచిన హరీశ్‌రావు
Harish Rao | తండ్రిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన విన్న హరీశ్ రావు సభా వేదిక పైనే కన్నీరు మున్నీరయ్యారు.
Harish Rao | తండ్రిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన విన్న హరీశ్ రావు సభా వేదిక పైనే కన్నీరు మున్నీరయ్యారు. అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని తల్లీబిడ్డలకు భరోసా ఇచ్చారు. అన్న మాట ప్రకారం నేడు ఆ తల్లీబిడ్డలను సిద్దిపేట క్యాంప్ ఆఫీసుకు పిలుచుకున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి టిఫిన్ చేశారు. చిన్నారి ఆవేదన విని కరిగిపోయిన వ్యాపార వేత్త తిరుమల్ రెడ్డి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాగా, 2లక్షల చెక్కును హరీశ్ రావు తన చేతుల మీదుగా తల్లీబిడ్డలకు అందించారు. ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్న తిరుమల్ రెడ్డిని హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారి భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటానని ఆవేదన చెందవద్దని హరీశ్ రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
భద్రంగా ఉండండి.. భవిష్యత్ లో ఎదగాలి అనే కార్యక్రమంలో సిద్దిపేట పట్టణానికి చెందిన నాగరాజు – విజయ దంపతుల కూతురు సాత్విక పాల్గొంది. కార్యక్రమంలో అమ్మానాన్నల గురించి వివరించే సమయంలో చిన్నారి సాత్విక స్టేజి మీదకు వచ్చి తనకు నాన్న లేడని చెప్పింది. అమ్మను ఎప్పుడూ ఇబ్బంది పెడుతున్నా అంటూ ఏడ్చేసింది. అది చూసి అక్కడే ఉన్న హరీశ్‌రావు చలించిపోయారు. తండ్రిని కోల్పోయి, తల్లిని ఇబ్బంది పెడుతున్నా అని ఆవేదనతో చిన్నారి చెప్పడంతో హరీశ్‌రావు మనసు కదిలిపోయింది. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ చిన్నారిని దగ్గరికి పిలుచుకుని ఆత్మీయంగా ముచ్చటించారు. తన బాగోగులు తెలుసుకున్నారు. మీటింగ్ జరిగే సమయంలోనే హరీశ్ రావు మిత్రుని సహాయంతో హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్త తిరుమల్ రెడ్డి చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని, తన వంతుగా 2లక్షలు సహాయం చేస్తా అని హరీశ్ రావుతో ఫోన్లో చెప్పారు.
ఈ క్రమంలోనే చిన్నారిని, ఆమె తల్లికి హరీశ్‌రావు ఫోన్ చేసి ఈ నెల 25వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో టిఫిన్ చేసేందుకు రావాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం ఉదయం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో వారితో కలిసి హరీశ్‌రావు టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో ఎదగాలని.. మంచి ఉద్యోగం సంపాదించి, మీ అమ్మను మంచిగా చూసుకోవాలని సూచించారు. అనంతరం రెండు లక్షల చెక్కును చిన్నారి తల్లికి అందజేశారు.
– అమ్మను కష్ట పెట్టొద్దు… అమ్మ ప్రేమ గొప్పది..
– నువ్వు మంచిగా చదవడమే అమ్మకు ఇచ్చే గొప్ప సంతోషం..
మళ్ళీ అమ్మను ఇబ్బంది పెడుతున్నావా… ఇబ్బంది పెట్టొద్దు.. అమ్మ ప్రేమ చాలా గొప్పది అని హరీశ్ రావు చిన్నారి తో ఆత్మీయంగా చెప్పారు.. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఎంతో గొప్పది అని.. నువ్ మంచి గా చదువు కొని… మంచి ఉద్యోగం వచ్చిన సందర్బం అమ్మకు ఎంతో ఆనందం గా ఉంటుందని.. అమ్మకు నువ్వు ఇచ్చే గొప్ప బహుమానం అదేనన్నారు.. భవిష్యత్ లో చదువుకు అయినా ఇంకా ఏ ఇబ్బందులు ఉన్న నేను అండగా ఉంటానని భరోసానిచ్చారు..
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- BRS
- harish rao
- Satvika
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

