టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి : ఎంపీ బీబీ పాటిల్
ఎంపీ బీబీ పాటిల్ | టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు.

న్యాల్కల్ : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం మండలంలోని మెటల్ కుంటలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఒక్కతాటిపై ఉండి మరింత కృషి చేయాలన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.
వచ్చేనెల 15వ తేదీన వరంగల్ లో నిర్వహించే విజయ గర్జన సభకు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలించేలా ప్రజా ప్రతినిధులు నాయకులు కృషి చేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎంపీపీ అంజమ్మ, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్,వైస్ ఎంపీపీ గౌస్ ఉద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, దర్శి రాజ్ కుమార్, నాయకులు ప్రవీణ్ కుమార్, భాస్కర్, నరసింహారెడ్డి, బక్క రెడ్డి, సర్పంచులు రవికుమార్, మారుతి యాదవ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

