Kangti Tahasildar Office | ఆ తహసీల్దార్ ఆఫీస్‌లోకి మీడియాకు నో ఎంట్రీ
Kangti Tahasildar Office | సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మీడియాకు నో ఎంట్రీ అంటూ అధికారులు పోస్టర్లు అతికించడం చర్చనీయాంశమైంది. మీడియాను కట్టడి చేసేందుకు తహసీల్దార్ ప్రయత్నిస్తున్నారని.. స్థానిక విలేకరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Kangti Tahasildar Office | కంగ్టి, మార్చి 27 : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మీడియాకు నో ఎంట్రీ అంటూ అధికారులు పోస్టర్లు అతికించడం చర్చనీయాంశమైంది. ఈ విషయం విలేకరులకు తెలియడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై విలేకరులు వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది వాటిని వెంటనే తొలగించారు.
ఎందుకోసం ఇలా పోస్టర్లను అతికేశారని ప్రశ్నించాలని విలేకరులు తహసీల్దార్ ఛాంబర్లోకి వెళ్లగా.. ఇది గమనించిన తహసీల్దార్ నజీమ్‌ఖాన్ కార్యాలయం పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విలేకరులను పిలిపించాలని ఎస్సై విజయ్‌కుమార్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆఫీసులో ఉన్న విలేకరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాము పోస్టర్లను ఎందుకోసం అతికించారని అడిగేందుకు కార్యాలయానికి వెళ్లామని విలేకరులు ఎస్సైకు సృష్టం చేశారు.
కాగా మీడియాను కట్టడి చేసేందుకు తహసీల్దార్ ప్రయత్నిస్తున్నారని.. స్థానిక విలేకరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియాపై విషం వెల్లగక్కిన తహసీల్దార్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక విలేకరులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also :
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

