MLA Manik Rao | ‘నమస్తే తెలంగాణ’ ఎఫెక్ట్.. ‘పొట్టిపల్లి అలుగు చెరువు కాలువ కబ్జా’ స్టోరీపై స్పందించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
MLA Manik Rao | నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ‘పొట్టిపల్లి గ్రామ శివారులోని అలుగు చెరువు కాలువ కబ్జా’ అనే కథనానికి స్పందించి ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, పత్రికా కథనం ఆధారంగా ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగారు.
MLA Manik Rao | ఝరాసంగం, జూన్30 : ప్రకృతి జల వనరులైన చెరువులు, వరద కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించి గోడలు నిర్మించడంపై జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్‌రావు తీవ్రంగా స్పందించారు. నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ‘పొట్టిపల్లి గ్రామ శివారులోని అలుగు చెరువు కాలువ కబ్జా’ అనే కథనానికి స్పందించి ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, పత్రికా కథనం ఆధారంగా ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగారు.
గ్రామస్థులతో కలిసి కబ్జాకు గురైన అలుగు చెరువు వరద కాలువ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ‘ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగేలా కాలువలను ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారు..?’ అని అధికారులను నిలదీశారు. తక్షణమే సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలను తొలగించి, వరద కాలువను యథాస్థితికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
తద్వారా స్థానిక రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ శ్యామల మొగులయ్య, నాయకులు సిద్ధన్న పాటిల్, విష్ణు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read Also :
Canal Missing | ప్రభుత్వ రికార్డుల్లోని కాల్వ మాయం.. ఫామ్‌ల్యాండ్ వెంచర్ కోసం ఆగని ఆక్రమణలు
Guo Wengui: చైనా బిలియనీర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు
AP News | రైల్వేస్టేషన్లో పాములు.. ప్రయాణికులు బెంబేలు..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

