జహీరాబాద్, ఫిబ్రవరి 24 : సైబరాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో(Police Games and Sports Meet) హద్నూర్ పోలీస్ క్రీడాకారులు అద్బుతమైన ఆట తీరు ప్రదర్శించారు. ఈ క్రీడా పోటీలో భాగంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ లకావత్ రవి కుమార్ (PC 3321) రెజ్లింగ్ పోటీలో (wrestling competition)కాంస్య పతకం సాధించాడు.
మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కానిస్టేబుల్ రవిని హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ తోటి సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.