Patancheru | గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు

పటాన్చెరు : గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడిన ఘటన పటాన్చెరులో శుక్రవారం జరిగింది. పటాన్చెరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు పట్టణంలోని గొల్లబస్తీలో నివసిస్తున్న నాగభూషణం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతడి ఇంట్లో గ్యాస్ లీకై దాని వాసన చుట్టు పక్కల ఇండ్లకు వ్యాపించింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు నాగభూషణంకు చెప్పే సరికే అతడు ఇంటి తాళం తీసి లోపలికెళ్లి విద్యుత్ బల్బును వేశాడు. వారి హెచ్చరికలతో ఇంట్లోంచి బయటకు రాగానే గ్యాస్ సిలిండర్ పేలింది.
ఈ పేలుడుతో పక్క పోర్షల్లో ఉంటున్న శ్యామల, సాయి, ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని వారిని పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించింది. స్థానిక కార్పొరేటర్ కుమార్‌యాదవ్ దవాఖానకెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యమందించాలని వైద్యులను కోరారు. ఈ ప్రమాదంపై పటాన్చెరు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

