న్యాల్కల్, అక్టోబర్ 6 : న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో బేగరి రామప్ప ఇంట్లో బుధవారం గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆయన కుమారుడు గ్యాస్ సీలిండర్ను బయటకు తీసుకువచ్చి మంటలను అర్పివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.
స్థానికుల కథనం ప్రకారం.. బేగరి రామప్ప భార్య కేశమ్మ టీ చేసేందుకు గ్యాస్ స్టౌవ్ను వెలిగించడంతో సీలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగడంతో కేకలు వేసింది.
అక్కడే ఉన్న ఆమె కుమారుడు బాల్రాజ్ గ్యాస్ సీలిండర్ ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చాడు.
వెంటనే స్థానికులతో కలిసి బాల్రాజ్ నీళ్లు, ఇసుక చల్లుతూ సిలిండర్ నుంచి ఎగిరిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. సకాంలంలో మంటలు ఆర్పివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.