సంగారెడ్డి, జనవరి 4: సంగారెడ్డి నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు క్రాంతికి జిల్లా అధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపగా, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, ప్రధాన కార్యదర్శి రవి, హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ అధ్యక్షుడు రాహుల్ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్‌ను సన్మానించిన వారిలో తహసీల్దార్లు మహిపాల్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, దశరత్, టీఎన్జీవోస్ నాయకులు శ్రీకాంత్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, నిర్మల, రాజకుమారి, నేతి శ్రీనివాస్, భాస్కర్, విజయ్‌కుమార్, సుధామణి, ఎండీ షకీల్, కృష్ణ, సుభాశ్, శ్రీకాంత్‌గౌడ్, రవికృష్ణ, హరిప్రసాద్, హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ నాయకులు అఖిల్, గణేశ్, అరుణ్ ఉన్నారు.