కోటి విలువైన ఆల్ఫాజోలం పట్టివేత
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో సర్వేనంబర్ 174/28 స్థలంలోని కోళ్లఫారంలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న ఆల్పాజోలాన్ని టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న 2.6 కిలోల ఆల్పాజోలం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు.
- తయారీ కేంద్రంపై టీజీ న్యాబ్, పోలీసుల దాడులు
- కొత్తపల్లిలో వివరాలు వెల్లడించిన సంగారెడ్డి ఎస్పీ రూపేశ్
గుమ్మడిదల, జూన్ 18: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో సర్వేనంబర్ 174/28 స్థలంలోని కోళ్లఫారంలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న ఆల్పాజోలాన్ని టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న 2.6 కిలోల ఆల్పాజోలం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు ఈ తతంగాన్ని నడిపిస్తుండగా, ఇద్దరిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ మం గళవారం ఘటనా స్థలంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం టీజీ న్యాబ్, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా కొత్తపల్లి గ్రామశివారులోని 174/28 స్థలంలోని కోళ్లఫారంలో తయారీ కేం ద్రంలో రూ. కోటి విలువైన ఆల్పాజోలం, వాటి తయారీ ముడి పదార్థాలను పట్టుకున్నారు. దీంతోపాటు యంత్రాలను సీజ్ చేశారు.
నిందితులు గోసుకొండ అంజిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్, క్యాసారం రాకేశ్ ముగ్గురు కలిసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని కొత్తపల్లిలో వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో కోళ్ల ఫారం నడుపుతూ గుట్టుచప్పుడు కాకుం డా బాలానగర్ నుంచి ముడి పదార్థాలను తీసుకొచ్చి కెమిస్ట్ క్యాసారం రాకేశ్ సహాయంతో ఆల్పాజోలం తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఆల్పాజోలాన్ని ప్రభాకర్‌గౌడ్ లోకల్ కల్లు దుకాణాల్లో అమ్మి డబ్బులు సంపాదించేవాడని ఎస్పీ రూపేశ్ మీడియాకు వెల్లడించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా మార్చడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ రూపేశ్ కోరారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి మత్తు పదార్థాలు తయారు చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ రూపేశ్ కోరారు. సమావేశంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, సంతోష్, సీఐ సుధీర్‌కుమార్, ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

