కార్డన్ సెర్చ్‌తో నేరాల నియంత్రణ
నేరాల నియంత్రణకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలో సీఐ ఆధ్వర్యంలో 45 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ తనిఖీ చేశారు.
- చల్మెడ గ్రామంలో పోలీసుల తనిఖీలు
- పత్రాలు లేని 17 బైక్‌లు స్వాధీనం
- సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
- రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి
నిజాంపేట, జనవరి 10: నేరాల నియంత్రణకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలో సీఐ ఆధ్వర్యంలో 45 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణతోపాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. వాహనదారులు సరైన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటి స్తూ ప్రమాదాలను నివారించాలన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని, అనుమానా స్పదస్థితిలో ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పంచాయతీపాలక వర్గాలు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. చల్మెడ గ్రామస్తులతో సమావేశమై.. సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వాలని సూచించారు. సర్పంచ్ నర్సింహారెడ్డి రూ.50వేలు, పంచాయతీ పాలకవర్గం రూ.75 వేల నగదు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు, నిజాంపేట, రామాయంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట, చేగుంట ఎస్సైలు శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్, నర్సింహులు, సుభాశ్‌గౌడ్, పోచయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

