కిర్బి కార్మికులకు న్యాయం చేస్తాం
కిర్బి పరిశ్రమ యాజమాన్యం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో కిర్బి పరిశ్రమ బీఆర్టీయూ, బీఎంఎస్, టీఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు.
- కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూను బలపర్చండి
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, జూన్ 26: కిర్బి పరిశ్రమ యాజమాన్యం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో కిర్బి పరిశ్రమ బీఆర్టీయూ, బీఎంఎస్, టీఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు మాజీ కార్మిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరుగనున్న కిర్బి కార్మిక సంఘం ఎన్నికల్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్, టీఎన్టీయూసీ, బీఎంఎస్‌లు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారని వివరించారు.
కూటమి తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేస్తారన్నారు. పెద్దిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరిశ్రమ యాజమాన్యాలకు సీఐటీయూ నాయకులు వత్తాసు పలుకుతూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కార్మిక నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తాను నియోజకవర్గంలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పారిశ్రామికరంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా అంతర్జాతీయ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. దీంతో లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. తనను గెలిపిస్తే కిర్బి కార్మికులకు న్యాయం చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, కార్మిక నాయకులు మాధవరావు, శ్రీనివాస్, సుదర్శన్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

