పాండురంగడి ఆషాఢ ఉత్సవాలు
తెలంగాణ పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగస్వామి దేవాలయం ఆషాఢ ఉత్సవాలకు సిద్ధమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే పాండురంగడుగా భక్తుల చేత కీర్తించబడిన ప్రాంతంగా మర్కూక్ పాండురంగాశ్రమం పేరుపొందింది.
- సిద్ధమైన మర్కూక్ పాండురంగాశ్రమం
- రేపటి నుంచి 18వరకు ఉత్సవాలు
- భారీగా తరలిరానున్న భక్తజనం
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆశ్రమ కమిటీ
మర్కూక్, జూలై 11 : తెలంగాణ పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగస్వామి దేవాలయం ఆషాఢ ఉత్సవాలకు సిద్ధమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే పాండురంగడుగా భక్తుల చేత కీర్తించబడిన ప్రాంతంగా మర్కూక్ పాండురంగాశ్రమం పేరుపొందింది. ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి, ద్వాదశితో పాటు వరుసగా మూడురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. దశమి రోజు అశేష భక్తజనం సమక్షంలో అఖండ హరినామ స్మరణ ప్రారంభించి ద్వాదశి వరకు మూడురోజుల పాటు నామసంకీర్తనలు కొనసాగుతాయి. ఏకాదశి రోజు భక్తులంతా ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. ఈనెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక పూజలు, ధార్మిక ప్రసంగాలు, సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థ్ధం వసతులు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.
మహా అన్నదానం..
భవానందస్వామి స్వహస్తాల చేత 1992లో ఆషాఢ ఉత్సవాల్లో మహా అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.కులమతాలకు అతీతంగా అన్నదానం చేస్తారు. ఆలయ నిర్వాహకులు ముందురోజున సాయంత్రం వివిధ రకాలైన వంటలను వండి అన్నాన్ని పెద్దరాశిగా ఆరబోసి అన్నపూజ నిర్వహించి చాటల ద్వారా భక్తులకు వడ్డిస్తారు. చాటల ద్వారా అన్నం వడ్డించడం దేశంలోనే మరెక్కడ లేని సాంప్రదాయం మర్కూక్ పాండురంగాశ్రమంలోనే ఉంది. చాటలతో వడ్డించే అన్నప్రసాదం స్వీకరణ కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

