సృజనకు నెలవు టీ-వర్క్స్
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది.
- వినూత్న ఆలోచనలతో వచ్చి.. ఉత్పత్తి నమూనాలతో తిరిగి వెళ్లేలా
- యువతకు ఉజ్వల భవిష్యత్తు చూపనున్న నమూనా కేంద్రం
- టీ హబ్ పక్కనే ప్రారంభానికి సిద్ధమైన టీ వర్క్స్
- నేడు దేశంలో అతి పెద్ద ప్రోటో టైప్ సెంటర్ ప్రారంభం
- 200పైగా అత్యాధునిక యంత్రాలను సమకూర్చిన ప్రభుత్వం
- 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
- 2.5 లక్షల చ. అ. విస్తీర్ణం పెంచేలా భవిష్యత్ ప్రణాళిక
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ పక్కనే విశాలమైన ప్రాంగణంలో టీ వర్క్స్‌ను మొదటి దశలో 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించింది. రెండవ దశలో 2.5 లక్షల చదరపు అడుగులకు విస్తరించేలా భవిష్యత్ ప్రణాళికతో ఏర్పాటు చేసింది. దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైప్ (నమూనా) సెంటర్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నది. యావత్ ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రాచుర్యం కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రాంతాలు, మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే టీ వర్క్స్‌కు వచ్చి అనుకున్న ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఉచితంగానే యంత్రాల వినియోగం
టీ హబ్‌లో స్టార్టప్‌ల ద్వారా సాఫ్ట్వేర్ అప్లికేషన్ల రూపకల్పన, మార్కెటింగ్‌కు అవకాశం, అదే విధంగా హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీకి టీ వర్క్స్ కేంద్రంగా మారనున్నది. పెట్టుబడులతో పని లేకుండా ఇక్కడ కావాల్సిందల్లా వినూత్నమైన ఆలోచనే ముఖ్యం. వినూత్న ఆలోచనతో వచ్చి ఒక పూర్తి స్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లేలా.. అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగంతో పాటు యంత్ర పరికరాలను ఉచితంగానే ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు. కాగా ఎంపిక ప్రక్రియను ప్రాథమికంగా నిపుణులు నిర్వహించి, వారి ఆలోచనలు ఒక వస్తువుగా తయారు చేసేందుకు అవకాశం ఉందో లేదో అంచనా వేసిన తర్వాత తయారీకి అనుమతిస్తారు. భవిష్యత్తులో అతి తక్కువ మొత్తంలోనే చెల్లించి యంత్రాలను వినియోగించుకోవచ్చు.
ఒక్కో విభాగానికి ఒక్కో యంత్రం ఏర్పాటు
భౌతికంగా ఒక వస్తువును తయారు చేయాలంటే చేతితో కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల అవసరం ఉంటుంది. అలాంటి వారికి ఒకే వేదికగా టీ వర్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో లేజర్ కటింగ్ యంత్రం, మిల్లింగ్, డ్రిల్లింగ్, కటింగ్, పాటరీ, సెరామిక్, కార్పెంటరీ, 3డీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రో మెకానికల్ టెస్టింగ్ యంత్రం, పీసీబీల తయారీ యంత్రం, డిజైన్ ఇంజినీరింగ్.. ఇలా మొత్తం 200లకు పైగా యంత్ర పరికరాలు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే యంత్రాలను దేశ, విదేశాల నుంచి తెప్పించి ఈ కేంద్రంలో ప్రయోగాలకు సిద్ధంగా ఉంచారు.
గత కొన్ని రోజులుగా ఎలక్ట్రానిక్ ల్యాబ్‌కు సంబంధించిన యంత్ర పరికరాలను బిగించి, వాటిపై నమూనా ఉత్పత్తులను తయారు చేశారు. ఇందులో ప్రధానంగా ప్రిసిషన్ సోల్డరింగ్ జోన్, పీసీబీ అసెంబ్లీ జోన్, వర్క్‌బెంచ్ జోన్, స్పాట్ వెల్డింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మట్టి పాత్రలు తయారు చేసేందుకు అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ పొట్టెరీ వీల్స్, ఎలక్ట్రిక్ కిన్, క్లే మిక్సర్, ఫగ్మిల్, ఇతర పరికరాలను పొట్టెరీ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఇలా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు కేటాయించిన జోన్లలో వాటిని బిగించి వినియోగించేందుకు సిద్ధంగా ఉంచారు.
ఎవరెవరు వినియోగించుకోవచ్చు
యంత్రాలను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆవిష్కర్తలతో పాటు కార్పొరేట్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్టు డెవలప్మెంట్ అండ్ ఆర్అండ్డీ, ఎంఎస్ఎంఈ, హార్డ్‌వేర్ స్టార్టప్స్, విద్యార్థులు, ఆర్టిస్టులు, హబీయిస్టులు, ఆర్టిజన్స్ అండ్ క్రాప్ట్స్, అకాడమిక్స్, రీసెర్చర్స్ వంటి కేటగిరీల్లోని వారు వినియోగించుకోవచ్చు. నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది.
టీ వర్క్స్ కోసం ప్రత్యేక బోర్డు…
టీవర్క్స్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ నరసింహారెడ్డి, టీ వర్క్స్ సీఈఓ సుజయ్ కారంపూరి, రెడ్ బస్ మాజీ సహ వ్యవస్థాపకులు ఫణీంద్ర సామా, జీఈ అప్లియెన్స్‌కు చెందిన శామ్యూల్ శీలం బోర్డులో ఉన్నారు. వీరితో పాటు ఇండస్ట్రీ అడ్వైజరీ కౌన్సిల్, డిజైన్ అడ్వైజరీ కౌన్సిల్లో జీఈ అప్లియెన్సెస్, హోనివెల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాషన్, క్వాల్కామ్ వంటి కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు.

ఇలా సంప్రదించాలి
ఈమెయిల్ అడ్రస్ : solutions@tworks.in
టీ వర్క్స్ వెబ్ సైట్ : https://tworks.telangana.gov.in/
వినూత్న వ్యవసాయ పనిముట్లు..
రైతులకు మార్కెట్లో దొరికే వ్యవసాయ పనిముట్లకు భిన్నంగా, పూర్తిగా కొత్త తరహాలో ఉండి, వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలను తయారు చేయాలన్న ఆలోచన కలిగింది. నా ఆలోచనకు అనుగుణంగా రకాల ఉప కరణాలను తయారు చేశాను. నేను తయారు చేస్తున్న సృజనాత్మకమైన పరికరాలు, వాటి పనితీరును గుర్తించారు. మరింత మెరుగ్గా వ్యవసాయ సంబంధమైన పరికరాలను తయారు చేసేందుకు టీ వర్క్స్‌లో అవకాశం కల్పించారు. టీ వర్క్స్‌లో ఉన్న ఎంతో అత్యాధునిక యంత్రాల సాయం, నిపుణుల సహకారంతో కొత్త పరికరాన్ని తయారు చేసుకోగలుగుతున్నా.
– జి.అశోక్, వ్యవసాయ ఉత్పత్తుల రూపకర్త, సూర్యాపేట జిల్లా
అందుబాటులో అత్యాధునిక యంత్రాలు
టీవర్క్స్‌లో రకరకాల ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు అవసరమైన అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నేను ఎలక్ట్రిక్ కారును తయారు చేశాను. ఎలక్ట్రిక్ కారును, నాలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి కొత్త పరికరాలను చేసుకునేందుకు టీవర్క్స్‌లో అవకాశం కల్పించారు. నా ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు ఇక్కడ వెల్డింగ్, బెండింగ్, కటింగ్ యంత్రాలతో పాటు వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకును అందిస్తున్నారు. ఇలాంటివన్నీ కల్పిస్తే సరికొత్త ఉత్పత్తులను సమాజానికి, గోకార్ట్ కోసం ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలన్న ఆలోచన ఉంది. నా ఆలోచనను ఇక్కడ నిజం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
– రాజేంద్ర ప్రసాద్, వరంగల్ జిల్లా.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Minister KTR
- T-hub
- T-works
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

