విమర్శలు మాని అభివృద్ధి చేయాలి
కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలను విమర్శించడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హితవు పలికారు. శుక్రవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకురుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
- వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి
- ప్రజాతీర్పును శిరసా వహిస్తున్నాం..
- ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు భవన నిర్మాణాలకు నిధులు తేవాలి
- సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ మారాడు.. అది మర్చిపోయారా
- ప్రతి శుక్రవారం నర్సాపూర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటా
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్, జూన్ 7: కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలను విమర్శించడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హితవు పలికారు. శుక్రవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకురుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నామని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నదని, గతంలో కంటే 2.34 శాతం ఓట్లు తగ్గాయనే విషయాన్ని గ్రహించాలని ఎద్దేవా చేశారు.
ప్రాంతీయ పార్టీలతో పొత్తున్న స్థానాల్లోనే బీజేపీ గెలిచిందని, పొత్తులేని స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని అన్నారు. అసలైన నాయకులు ఇతర పార్టీల నాయకులను గౌరవించాలని, వ్యక్తిగత విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. తనపైనా, కేసీఆర్‌పైనా, హరీశ్‌రావుపైన విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు మంచిది కాదని మండిపడ్డారు. సమస్యలపై అధికార పార్టీ స్పందిస్తలేదని, కేవలం విమర్శలకే సరిపోయిందని అన్నారు. పార్టీ మారారని స్థానిక కాం గ్రెస్ నాయకులు తనపై పదేపదే విమర్శలు చేసేముందు, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి వచ్చాడనే విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు.
పార్టీ మారిన నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని దీని గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. తాను పార్టీ మారి ఐదేండ్లు అవుతుందని, ప్రజలు తనన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. అధికారంలో ఉన్నాలేకున్నా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని వెల్లడించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలకు, కళాశాలలకు శాశ్వత భవనాలు లేవని, వాటిని నిర్మించడానికి కృషి చేయకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ నాయకులను సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నాయకులు అనే ముందు, మోదీ తెలంగాణ వచ్చినప్పుడు బడేబాయ్ చోటేబాయ్ అని ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోవద్దని చురకలంటిచారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గానికి రూ.200 కోట్లు ఎస్డీఎఫ్ వచ్చాయని, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వాటిని తిరిగి మం జూరు చేపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చురకలంటించారు. ఇక మీదట తాను ప్రతి శుక్రవారం నర్సాపూర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, నాయకులు సూరారం నర్సింహులు, జీవన్‌రెడ్డి, సేనాధిపతి, ఆంజనేయులు, కరుణాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

