కనుల పండువగా నిర్వహించాలి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పనులపై ఆరా తీశారు. భక్తుల వసతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆలయ అధికారులకు తెలిపారు
- మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
- భక్తులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలి
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- కొమురవెల్లిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
చేర్యాల, డిసెంబర్ 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పనులపై ఆరా తీశారు. భక్తుల వసతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆలయ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ మల్లన్న గుట్టపై ఢమరుకం, త్రిశూలం ఏర్పా టు పనుల కోసం ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దాతలతో కలిసి పనులు జరిగేలా చూడాలన్నారు. భక్తులకు సకాలంలో దర్శనమయ్యే విధంగా ఆలయవర్గాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భక్తులు వచ్చే వాహనాలు వెళ్లే దారులు విశాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ఎలాంటి వస్తువులు, ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయకుండా సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఆలూరి బాలాజీ, ఏఈవో వైరా గ్యం అంజయ్య, ఆలయ డైరెక్టర్లు, జడ్పీటీసీ సిద్ధప్ప, ఎంపీపీ కీర్తనాకిషన్, ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు.
‘మల్లన్న’ ప్రత్యేక పూజల సామగ్రి సిద్ధం

ఈ నెల 18న నిర్వహించే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల వెండి తదితర సామగ్రిని ఆలయవర్గాలు సిద్ధం చేశాయి. కల్యాణంలో ఉపయోగించే కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం తదితర వెండి, పంచలోహ సామగ్రిని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయవర్గాలు సిద్ధం చేశాయి. స్వామి వారి కల్యాణోత్సవం మొదలుకొని ఏకాదశరుద్రాభిషేకం, లక్షబిల్వార్చన తదితర పూజలకు సదరు సామగ్రి కీలకం కావడంతో ఏటా ఆలయవర్గాలు కల్యాణోత్సవం ముందు రోజుల్లో శుభ్రం చేసి పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది.
కల్యాణ వేద పర్యవేక్షణకు బార్సీ పీఠాధిపతి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ వేద పర్యవేక్షణకు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బార్సీ మహాపీఠాధిపతి గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామిజీ రానున్నారు. స్వామిజీ ఈ నెల 17న రాత్రి పొద్దుపోయిన తర్వాత కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి చేరుకుంటారని ఆలయవర్గాలు తెలిపాయి. ఆదివారం వేకువజామున ఆలయవర్గాలు నిర్వహించే దృష్టికుంభాల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్వామి వారి తొలి దర్శనాన్ని చేసుకోనున్నారు. అనంతరం ఉదయం 10.45గంటలకు ప్రారంభమై కల్యాణోత్సవాన్ని పర్యవేక్షిస్తారు. స్వామిజీ రాక సందర్భంగా ఆలయవర్గాలు అన్ని వసతులు కల్పిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

