మేమున్నాం..అధైర్యపడొద్దు
పటాన్చెరు ఎమ్మెల్యే పార్టీ నుంచి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ క్యాడర్ గుండె ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, తాము అన్నింటికి అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
- ‘గూడెం’ పోయినా గుండె ధైర్యం కోల్పోవద్దు
- మహిపాల్‌రెడ్డికి మూడుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించాం
- పటాన్‌చెరుకు నిధుల వరద పారించాం
- ఆయన పార్టీని వీడినంత మాత్రాన కోల్పోయేది ఏమీలేదు..
- కార్యకర్తలే బీఆర్ఎస్ బలం.. బలగం
- పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట
- మళ్లీ గులాబీజెండా ఎగరడం ఖాయం
- పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసుకుందాం
- ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ సర్కారు
- ఒక్క హామీ సరిగ్గా అమలు కావడం లేదు..
- పటాన్చెరులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
పటాన్చెరు/రామచందాప్రురం,జూలై 17 : పటాన్చెరు ఎమ్మెల్యే పార్టీ నుంచి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ క్యాడర్ గుండె ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదని, తాము అన్నింటికి అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణ పరిధిలో కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నాయకులను కలిసి ఆత్మైస్థెర్యం చెప్పేందుకు బుధవారం హరీశ్‌రావు వచ్చారు. హరీశ్‌రావు రాక సమాచారం తెలియడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సింధూ ఆదర్శ్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
మాజీ స్పీకర్ మధుసూదనచారి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమన్నారు. కార్యకర్తలకు ధైర్యం చెబుదామని తాను వచ్చానన్నారు. కానీ, వారే తనకు ధైర్యం చెబుతున్నారని అన్నారు. కొందరు ముఖ్యనాయకులకు కలిసేందుకు రామచంద్రాపురం వచ్చానని , తాను వస్తున్న వార్తతో పార్టీ శ్రేణులు మేమున్నామని కదలి వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో లేదని, అది ప్రజలు, కార్యకర్తల హృదయాల్లో పదిలంగా ఉందన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం, బలగం అన్నారు. మీరందరూ కష్టపడితేనే గూడెం మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడని, మూడుసార్లు ఆయన్ను ఎమ్మెల్యేగా చేసింది బీఆర్ఎస్ అన్నారు.
వైసీపీ టికెట్ ఇవ్వని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తల్లిలా దగ్గరకు తీసుకుని టికెట్ ఇచ్చి ఆయన్ను గెలిపించుకుందని గుర్తుచేశారు. పటాన్‌చెరుకు ఎలాంటి నిధులు కావాలని కోరినా ప్రాధాన్యత ఇచ్చి కేటాయించినట్లు గుర్తుచేశారు. నాడు సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని పటాన్చెరు పారిశ్రామికవాడను అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దారన్నారు. ఇంత చేసినా మహిపాల్‌రెడ్డి పార్టీ మారడం న్యాయమా..? నీకిది తగునా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదన్నారు. పటాన్చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని, ఇక్కడ మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
పటాన్చెరు బీఆర్ఎస్కు కంచుకోట..
పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్న వారే కాలగర్భంలో కలిసినట్లు గుర్తుచేశారు. కష్టాలు వస్తాయి, పోతాయని, మీరంతా ధైర్యంగా ఉండాలని క్యాడర్‌ను కోరారు. మీ బాధ్యత తాను తీసుకుంటానని, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని క్యాడర్‌కు హామీ ఇచ్చారు. పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుందామన్నారు. మళ్లీ పారిశ్రామికవాడలో గులాబీ జెండాను ఎగురవేసే వరకు కష్టపడి పనిచేద్దామన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదంతా ప్రజలు చూస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనను, రేవంత్‌రెడ్డి పాలనను పోల్చుకుంటున్నారన్నారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు ప్రయాణం తప్పా ఏ ఒక్క హామీ అమలు కావడం లేదన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్కు మంచి నాయకులు ఉన్నారని, వారి నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమన్నారు. త్వరలో పటాన్చెరులో బీఆర్ఎస్ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని హరీశ్‌రావు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

