రైతులను వంచిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ అంటూ రైతులను వంచిస్తున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పంట రుణమాఫీ సంబురాలు కావని, కేవలం రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమంలా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు.
- పంట రుణమాఫీ సంబురాలు కాదు
- రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం
- ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
నర్సాపూర్, జూలై 19: కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ అంటూ రైతులను వంచిస్తున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పంట రుణమాఫీ సంబురాలు కావని, కేవలం రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమంలా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత రుణమాఫీని ఏకకాలంలో చేశామని రేవంత్‌రెడ్డి గొప్పలు చెబుతున్నాడని, రాజశేఖర్ రెడ్డి ఏకకాలంలోనే రూ.లక్ష రుణమాఫీ చేశారని తెలిపారు.
రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీని కూడా విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నాడన్నారు. పదేండ్లలో రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, వాళ్లకు కండ్లుండి కనిపంచలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఐదేండ్లకు రుణమాఫీ చేస్తామని చెప్పి, చేశామన్నారు. నిన్నటి ఐదేండ్లలో వాయిదా పద్ధతిలో రూ.20 వేలు, రూ.50 వేలు, రూ.75 వేలు మాఫీ చేశామన్నారు. ఎన్నికల కంటే ముందు మిగతా రుణాన్ని మాఫీ చేస్తానని డబ్బులు రెడీ చేసుకున్నాక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిలిపేశారన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన రుణమాఫీలో చాలా మందికి లక్ష వరకు కాలేదని రైతులు ఫోన్లు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తప్పకుండా నిరసనలు ఎదురవుతాయన్నారు. గోల్డ్ లోన్స్, మార్టిగేజ్, దీర్ఘకాలిక పంటల రుణాల్లాంటివి మాఫీ చేయకుండా కేవలం స్వల్పకాలిక రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. కేసీఆర్ ఆనాడు కేవలం పట్టాపాస్ బుక్ చూసి మాత్రమే రైతులకు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. నేడు అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తూ కండీషన్లు పెట్టారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 14 సార్లు రూ.లక్ష కోట్ల వరకు రైతుబంధు వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు వేయాల్సి ఉండగా ఒక్కసారి కూడా వేయలేదన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మెదక్ ఎమ్మెల్యే ఫొటో పెట్టి కార్యక్రమాలు చేయడం ప్రజాప్రతినిధులపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమోద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, షేక్ హుస్సేన్, రింగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

