పరిశ్రమల్లో స్థ్థానికులకు ఉద్యోగాలివ్వాలి
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులోని ఐలా కార్యాలయంలో సోమవారం ఆయన పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
- పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
అమీన్‌ఫూర్(జిన్నారం), జూన్ 22 : స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులోని ఐలా కార్యాలయంలో సోమవారం ఆయన పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెడికల్ డివైజెస్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు తదితర విషయాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ మెడికల్ డివైజెస్ పార్కులో 120 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయన్నారు.
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో రిక్రూట్మెంట్ జరిగే సమయంలో ప్రతి ఒక్కరికీ సమాచారం అందేలా చూడాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేలా పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని సూచించారు. నూతన పరిశ్రమల స్థాపనకు తగిన సహకారం ఉంటుందన్నారు. ఐలా కమిషనర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

