టెన్త్ ఫలితాలు మనందరికీ గర్వకారణం
టెన్త్ ఫలితాలు మనందరికీ గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదోతరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన 75 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఒకొకరికీ రూ.10వేల విలువైన ఐప్యాడ్లను ఆయన అందజేశారు.
- ఉత్తమ ఫలితాలు పొందినప్పుడు కలిగే అనుభూతి గొప్పది
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
- పదోతరగతిలో10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఐప్యాడ్లు అందజేత
సిద్దిపేట, జూలై 14 : టెన్త్ ఫలితాలు మనందరికీ గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదోతరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన 75 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఒకొకరికీ రూ.10వేల విలువైన ఐప్యాడ్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట పేరును విద్యార్థులు చరిత్ర పుటల్లో నిలిపారన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు కలిగే అనుభూతి ఎంతో గొప్పదన్నారు. పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, అకడి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి అభినందనలు తెలిపినట్లు గుర్తుచేశారు. సొంత ఖర్చులతో స్నాక్స్, డిజిటల్ పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు. గతేడాది కంటే ఈసారి ఎకువ ఉత్తీర్ణతశాతం సాధించారని, సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, సిద్దిపేటకు పేరు తీసుకురావడంపై విద్యార్థులను అభినందించారు. బాసరట్రిపుల్ ఐటీలో 169 సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సహకరించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మున్సిపల్ మాజీ చైర్మ న్ రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీకాంత్‌రెడ్డి, బాలకృష్ణ, మాజీ జడ్పీటీసీ తుపాకుల బాల్‌రంగం, నాయకులు సోమిరెడ్డి, కోల రమేశ్‌గౌడ్, ఎల్లారెడ్డి, మేర్గు మహేశ్, ఎంఈవో యాదవరెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

