సిద్దిపేట.. ప్రయోగశాల
సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొనసాగించాలన్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన విద్యా దినోత్సవంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
- సమష్టి కృషితోనే రెండో స్థానంలో జిల్లా
- భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
- మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- సిద్దిపేట పట్టణ శివారులోని పోలీస్ కన్వెన్షన్హాల్లో విద్యా దినోత్సవం
సిద్దిపేట అర్బన్, జూన్ 20 : సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొనసాగించాలన్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన విద్యా దినోత్సవంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలైనప్పుడు పరీక్ష రాసిన విద్యార్థిలాగా తాను కూడా ఉత్కంఠగా ఎదురు చూశానన్నారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు పారితోషికం అందిస్తానని మాటిచ్చానని గుర్తు చేశారు. విద్యా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ స్థానం వచ్చినా చాలా సంతోషపడ్డానని.. గత నాలుగేండ్లుగా సిద్దిపేట జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు.
ఇది జిల్లా ప్రజలకు గర్వ కారణమన్నారు. దీని వెనుక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఉందన్నారు. ఇది సమష్టి విజయమన్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరం 97.85 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 98.65 శాతం సాధించి గతం కంటే 1.4 శాతం ఉత్తీర్ణత పెరిగినా.. రెండో స్థానంలో నిలిచామన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు మాత్రమే కాదని.. విద్యారంగంలో అగ్రభాగాన నిలబెట్టడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ఉత్తమమైన సమాజ నిర్మాణం కావాలంటే విద్య చాలా ముఖ్యమన్నారు. వచ్చే సంవత్సరం నుంచి టెన్త్ మాత్రమే కాకుండా ఇంటర్‌పై కూడా దృష్టి సారించి మంచి ర్యాంకు సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో వంద శాతం ఫలితాలు సాధించిన 219 పాఠశాలలకు, 10 జీపీఏ సాధించిన 126 మంది విద్యార్థులకు, వంద శాతం ఫలితాలు సాధించిన 8 మండలాల ఎంఈఓలకు అభినందనలు తెలిపారు. వంద శాతం ఫలితాలు సాధించిన 8 మండలాలకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని మంత్రి తెలిపారు. ఫలితాలు వెల్లడైనపుడు తాను అమెరికాలో ఉన్నా.. విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడితే చాలా సంతోషమనిపించిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. అభివృద్ధిలోనే కాదు విద్యలోనూ సిద్దిపేట ముందే ఉందన్నారు.
నాడు నో అడ్మిట్.. నేడు నో అడ్మిషన్..
నాడు ప్రభుత్వ పాఠశాలలు అంటే నో అడ్మిట్ అని అనే పరిస్థితి ఉండేదని.. కానీ నో అడ్మిట్ నుంచి నో అడ్మిషన్ అని బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడం గొప్ప విషయని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం నో అడ్మిషన్ బోర్డులు కనబడుతున్నాయని.. అది చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలలకు అందించిన ఇంటారాక్టివ్ ఫ్లాగ్ ప్యానెల్‌కు మంచి స్పందన లభిస్తుందన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో అనేక పాఠశాలలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. సిద్దిపేట నేడు విద్యాక్షేత్రంగా మారిందన్నారు. నేడు ఏదైనా తక్కువ ఉందా అని వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. త్వరలోనే సిద్దిపేటకు లా కళాశాల కూడా రాబోతుందన్నారు. రిజర్వాయర్ల ఖిల్లా.. ఆలయాల జిల్లాగా ఉన్న సిద్దిపేట విద్యానిలయంగా మారిందన్నారు.
ఇటీవల తమిళనాడు రాష్ట్రం నుంచి తిరుచ్చి అనే పట్టణం వారు వచ్చి నేర్చుకొని వెళ్లారన్నారు. ఇది సిద్దిపేటకు గౌరవంతో పాటు గర్వకారణమన్నారు. సిద్దిపేటలో నిర్మించిన స్వచ్ఛబడి నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోతుందన్నారు. ఇప్పటి వరకు మన ఊరు -మన బడి ద్వారా జిల్లాలో రూ.41 కోట్లు ఖర్చు పెట్టామని.. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌కు సూచించారు. ఎన్ని నిధులు కావాలన్నా తాను తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట అంటే ఒక గౌరవం ఉందని.. దాన్ని ఇలాగే కొనసాగిద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నాడు జిల్లాలో 9 గురుకులాలు మాత్రమే ఉండి 5 వేల విద్యార్థులు చదువుకునేవారని.. నేడు 33 గురుకులాలు ఏర్పడి 20 వేల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 జీపీఏ సాధించిన 126 మంది విద్యార్థులకు ఐపాడ్లు, 219 మంది పాఠశాలలకు రూ.25 వేల చొప్పున రూ.55 లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

