పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
మెదక్ జిల్లా కూల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గుర్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.17,300 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మెదక్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కూల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి గ్రామంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17,300 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని కూల్చారం గ్రామానికి చెందిన సత్యనారాయణ, శేఖర్, నర్సింలుగా గుర్తించారు. పేకాటకు సంబంధించి కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామాల్లో పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

