మనోహరాబాద్/ వెల్దుర్తి/ రేగోడ్/ చిలిపిచెడ్/ మెదక్ రూరల్/ చేగుంట, జూన్ 6 : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమాన, మెరుగైన విద్యను అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ పనులను సోమవారం ప్రారంభించారు. బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని కొనియాడారు. మనోహరాబాద్ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ. 7 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, శైలేంద్ర, ఎస్ఎంసీ చైర్మన్ మల్లేశ్, నాయకులు భిక్షపతి, శ్రీరామ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
‘మనఊరు-మనబడి’తో పాఠశాలలకు మహర్దశ..
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ వస్తున్నదని వెల్దుర్తి ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ అ న్నారు. హస్తాల్పూర్, కుకునూర్, దామరంచ గ్రామాల్లోని ప్ర భుత్వ బడుల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మమత, భాస్కర్‌రెడ్డి, ఎం పీటీసీలు బాబు, లక్ష్మి, భాస్కర్‌గౌడ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఏపీవో రాజు, నాయకులు నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పాం డు, విష్ణు, ఏఈ శ్రీనివాస్, మురళీ పాల్గొన్నారు.
రేగోడ్ మండలంలోని ఇటిక్యాల్(ఆర్) గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన వివిధ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకె రమేశ్, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్, అజ్జమర్రి గ్రామాల్లో ‘మనఊరు – మన బడి’ పాఠశాలల్లో పనులు స్థానిక సర్పంచ్‌లు పరిశీలించారు. ఫైజాబాద్ పాఠశాలకు రూ.17 లక్షలు, అజ్జమర్రి పాఠశాలకు రూ.11.75 లక్షలు మంజూర య్యాయి. కార్యక్రమంలో సర్పంచ్‌లు మనోహరానర్సింహరెడ్డి, పరశురాంరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్లు సురేఖ, వీరాస్వామి, హెచ్ఎంలు తారాసింగ్, నరేశ్, ఉప సర్పంచ్‌లు రాములు, పోచయ్య, ఎంపీటీసీ మల్లయ్య, నేతలు నగేశ్హయాదవ్, సంగాగౌడ్, విఠల్, శశికాంత్, బాల్‌రాజు, జనార్దన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
చండూర్ గ్రామంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు వెంకటస్వామి, మోహన్, చందర్, నరేశ్ బడిబాట చేపట్టారు.
మెదక్ మండలం చిట్యాలలో హెచ్ఎం సత్యనారాయణ పిల్ల లను బడికి పంపించాలని బడి బాట నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశం, ఎస్ఎంసీ చైర్మన్ శేఖర్, కార్యదర్శి ప్రవీణ్, టీచర్లు నర్సింహులు, షాకీర్ అలీ ఉన్నారు.
మన ఊరు బడిలోనే మంచి చదువులు ఉన్నాయని నార్సిం గి ఎంపీపీ సబిత పేర్కొన్నారు. పెద్దతండా పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజల చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్‌మేరీ, ఎంపీవో సతీశ్, హెచ్ఎం వాసు, సర్పంచ్ చత్రీయనాయక్, కార్యదర్శి బాబు పాల్గొన్నారు.