నర్సాపూర్/ శివ్వంపేట/ పాపన్నపేట, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగులపల్లి గ్రామంలో పల్లె ప్రగతి, మూసాపేట్ గ్రామంలో పల్లెప్రగతి, వైకుంఠధామం, ఎల్లారెడ్డిగూడాలో సేవాలాల్ మహరాజ్ జగదాంబమాత ఆలయ నిర్మాణానికి భూమిపూజ, రుస్తుంపేట్లో పల్లె ప్రగతి, ‘మనఊరు-మన బడి’ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ విద్యాబోధనను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా, వైస్‌ఎంపీపీ వెంకటనర్సింగరావు, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, జడ్పీటీసీ బాబ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజూయాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
‘మనఊరు-మనబడి’తో సకల సౌకర్యాలు
‘మన ఊరు-మనబడి’ పథకంతో సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామంలో ‘మన ఊరు-మనబడి’లో మంజూరైన పనులను సర్పంచ్ లావణ్యామాధవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యాబోధన కొనసాగనున్నదని, ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. శివ్వంపేటలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఎంఈవో బుచ్యానాయక్, శ్రీపాద ట్రస్టు చైర్మన్శ్రీధర్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఎంపీటీసీ నర్సింహరెడ్డి, నేతలు సుధీర్‌రెడ్డి, రాజశేఖర్‌గౌడ్, ఇన్చార్జ్ హెచ్ఎం రమేశ్, ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.
దుర్గా మాతను దర్శించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే
ఏడుపాయల వనదుర్గాభవానీమాతను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.