శివ్వంపేట/కొల్చారం/నిజాంపేట/టేక్మాల్, జూన్ 1 : ప్రతిఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రవికాంత్‌రావు సూచించారు. బుధవారం శివ్వంపేట లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంఈవో బుచ్యానాయక్ ఆ ధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని, ఆన్లైన్ మో సాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. బ్యాంకు అధికారులుగా మాట్లాడేవారిని, రుణాలు ఇస్తామని చెప్పే వారిని నమ్మొద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కని పించే వ్యక్తుల సమాచారాన్ని డయల్ 100కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాయమాటలు నమ్మొద్దు : ఎస్సై శ్రీనివాస్‌గౌడ్
సైబర్ నేరాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కొల్చారం మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల మాయ మాటలను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేవారు తెలియని మెస్సేజ్‌లకు స్పం దించవద్ద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని, ఇతరత్రా ఆశ చూపి ఆన్లైన్ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని, వారి మాటలకు స్పందించొద్దని ఎస్సై సూచించారు.
మోసపూరిత మెసెజ్‌లకు స్పందించొద్దు..
నిజాంపేట బస్టాప్ వద్ద ‘సైబర్ నేరాలు- నియంత్రణ’పై ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. అపరిచితుల మాటలను నమ్మొద్దని, వారికి ఎలాంటి వివరాలు చెప్పొద్దని, మోసపూరిత ఫోన్ కాల్స్, మెసెజ్‌లకు స్పందించకూడదన్నారు.అవగాహనతోనే ఆన్లైన్, సైబర్ మోసాలను అడ్డుకోవ చ్చని టేక్మాల్ ఎస్సై లింగం, ఏఎస్సై దయానంద్ సూచిం చారు. సాలోజిపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు.