గ్రామాలకూ బీ-పాస్
గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట వేయనున్నది.
- పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు
- పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లకు చెక్ పెట్టేందుకు అమలు
- గ్రామ పంచాయతీలకు టీఎస్ బీ-పాస్‌తో అనుసంధానం
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 18: గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట వేయనున్నది. ఇందుకోసం గ్రామాలనూ టీఎస్ బీ-పాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం ఆన్ సెల్ఫ్ సర్టిఫికేషన్) పరిధిలోకి తీసుకువచ్చేందుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మున్సిపల్ పాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే టీఎస్ బీ-పాస్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు వర్తింపజేయాలని టీఎస్ బీపాస్ తరహాలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ప్రభుత్వం ఫిబ్రవరి 27న పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. గ్రామాల్లో వెలిసే లే అవుట్లు, ఇండ్ల నిర్మాణాల అనుమతి కోసం నూతన సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే టీఎస్ బీ-పాస్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అక్రమ లే అవుట్లను అడ్డుకునేందుకే..
ముఖ్యంగా పట్టణాల శివారులోని భూముల ధరలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు, ఇండ్ల నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ బీపాస్ గ్రామాల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పట్టణ జనాభా కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ప్రజలు నివసిస్తున్నారు. పట్టణాల శివారు గ్రామాల్లోనే శరవేగంగా పంటపొలాలు వెంచర్లుగా మారుతున్నాయి. కొందరు మాత్రమే లే అవుట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. చాలా మంది రియల్టర్లు అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తున్న అమాయక ప్రజలు మోసపోతున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసిన తరువాత అలా చేస్తే అక్రమ లేఅవుట్లను రద్దు చేయడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఉండవు.
సులభంగా అనుమతులు…
టీఎస్ బీ-పాస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత భవన నిర్మాణాల అనుమతి సులభంగా మా రింది. గతంలో ఎవరైనా ఇల్లు నిర్మించాలంటే మున్సిపాలిటీల్లో గుర్తింపు పొందిన లైసెన్స్ సర్వేయర్ల ద్వారా దరఖాస్తు చేసుకునే వారు. ఈ విధానంలో నెలలు దాటిన అనుమతులు రాకపోయేవి. టీఎస్ బీ-పాస్ వచ్చిన తరువాత దరఖాస్తు దారుడికి కేవలం 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సి వస్తోంది. లేని పక్షంలో ఆన్లైన్లో అనుమతి లభిస్తుంది. 75గజాల లోపు నివాస స్థలాలకు అనుమతులు అవసరం ఉండదు. నామ మాత్రంగా రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. గ్రామాల్లో టీఎస్ బీపాస్ అందుబాటులోకి రాగానే మున్సిపాలిటీల విధానంగానే అనుమతులు పొందాల్సి ఉంటుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

