కొమురవెల్లి/మద్దూరు(ధూళిమిట్ట)/రాయపోల్/గజ్వేల్/మర్కూక్/ కోహెడ/దుబ్బాక టౌన్/ కొండపాక/జగదేవ్‌పూర్/దౌల్తాబాద్/హుస్నాబాద్‌టౌన్/ హుస్నాబాద్ రూరల్/వర్గల్/ చేర్యాల, జూన్ 3 : పట్టణాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు టీఆర్ఎస్ సర్కారుపల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొదటి రోజు మున్సిపాలిటీలోని 12 వార్డులో సమావేశాన్ని నిర్వహించారు.
పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. 5వ వార్డులో జరిగిన సమావేశంలో కౌన్సిలర్ ఆడెపు నరేందర్, కమిషనర్ రాజేంద్రకుమార్ పాల్గొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వర్గల్ మండల పరిషత్ అధికారి మేరిస్వర్ణకుమారి అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని తున్కిఖల్సా గ్రామంలో సర్పంచ్ సంధ్యాజాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంపీటీసీ గొడుగు జనార్దన్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపసర్పంచ్ లక్ష్మణ్,కారోబార్ నగేశ్‌గౌడ్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతిని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎల్పీవో వేణుగోపాల్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో పల్లె ప్రగతిని ప్రారంభించారు.
దుబ్బాక మున్సిపాలిటీలో చైర్పర్సన్ గన్నె వనితా ఆధ్వర్యంలో పలు వార్డుల్లో సమావేశాలు నిర్వహించారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనుల విషయమై వార్డుల వారీగా తీర్మానం చేశామని చైర్పర్సన్ వనిత, కమిషనర్ గణేశ్‌రెడ్డి తెలిపారు. సమావేశాల్లో ఏఈ పృథ్వీరాజ్, కౌన్సిలర్లు పల్లె మీనా రామస్వామి గౌడ్, లొంక రాజవ్వ, ఆస యాదగిరి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక మండలంలో శుక్రవారం 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుబ్బాక మండలంలో బల్వంతాపూర్, చౌదర్పల్లిలో క్రీడాప్రాంగణాలను ఎంపీపీ, జడ్పీటీసీలు ప్రారంభించారు. ఎంపీడీవో భాస్కరాశర్మ, తహసీల్ధార్ సలీం, సర్పంచ్‌లు బాల్‌లక్ష్మీ కిష్టయ్య, కుమార్ ఎంపీటీసీ మమతారాజిరెడ్డి పాల్గొన్నారు.
పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నదని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు మండలంలోని మర్మాములలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశంతో కలిసి ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని కొమురవెల్లి ఎంపీపీ తలారికీర్తనాకిషన్ అన్నారు. శుక్రవారం కొమురవెల్లి మండల వ్యాప్తంగా 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భగా రెవెన్యూ అధికారులు అప్పజెప్పిన 20 గుంటల స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయనున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేద్దామని మున్సిపల్‌చైర్ పర్సన్ ఆకుల రజితా వెంకన్న అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం స్థానిక 15వ వార్డులో వార్డు కమిటీసభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు తప్పనిసరిగా మొక్కలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కమిషనర్ విద్యాధర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని 20 వార్డులో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది పట్టణ ప్రగతి ప్రారంభ సమా వేశాలను నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్ పాల్గొన్నారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో సర్పంచ్ భాగ్యా భిక్షపతి అధ్యక్షతన గ్రామమసభ నిర్వహించారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత అభివృద్ది చేసుకుంటామని తెలిపారు. కొండపాక మండలంలోని కుకునూర్‌పల్లిలో సర్పంచ్ జయంతీ నరేందర్ ఆధ్వర్యంలో పల్లెప్రగతి నిర్వ హించారు. రాయ పోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రత్యేక అధికారి బాబునాయక్ పాల్గొని మాట్లాడారు. పల్లెప్రగతిని విజయవంతం చేయా లన్నారు.