ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులు, బాలింతలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50కిలోల కేక్ కట్ చేశారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ టీహెచ్ఆర్’ కార్యక్రమాన్ని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధి నుంచి సిద్దిపేట స్టేడియం వరకు నిర్వహిం చారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై చిన్నకోడూరు మండల ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
గజ్వేల్, జూన్ 3: ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కేక్‌ను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి కట్ చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులు, బాలింతలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. సమీకృత మార్కెట్లో ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్ ఆధ్వర్యంలో 50మంది నాయకులు, అభిమానులు రక్తదానం చేయగా, శిబిరాన్ని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. గజ్వేల్ నల్లవాగు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్యారాషహీద్ దర్గాలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు. క్రిస్టియన్ భవన్లో పాస్టర్ రూబెన్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పాస్టర్లంతా ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేశారు. సంగాపూర్‌లో ఎక్బాల్ ఆధ్వర్యంలో 50 కిలోల కేక్‌ను కట్ చేశారు.