అందోల్, జూన్3: వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తూ రైతులకు అన్ని రకాలు గా అండగా నిలుస్తున్నది. ఈ వానకాలం సీజన్లో పంట ల సాగులో సమూలా మార్పులు తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక లాభాలు సాదించ డం, లాభదాయక పంటల సాగువైపు రైతులు దృష్టి పెట్టే లా ప్రోత్సహిస్తున్నారు. పంటల సాగులో అనుసరించా ల్సిన ప్రధాన అంశాలను ఎంచుకుని క్లస్టర్ల వారీగా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారు లు సిద్ధమవుతున్నారు. సేంద్రియ ఎరువులు వాడుతూ భూసారం పెంచుకోవడంతో పాటు పెట్టుబడులు తగ్గించి దిగుబడి పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా రు.
సంవత్సరాల తరబడి భూముల్లో రైతులు వినియోగిస్తున్న రసాయన ఎరువులతో పుట్లకొద్ది పంటలు పండి న భూములు వాటిసారం కోల్పోయి నిర్జీవంగా తయారయ్యాయి. దీనిని గుర్తించిన అధికారులు ఇందుకోసం భూముల్లో సేంద్రియ పదార్థాలను పెంచే చర్యలకు ఉపక్రమించారు. దీనికి గానూ పచ్చరొట్ట ఎరువులను సాగు చేయిస్తున్నారు. అందుకోసం ఇప్పట్టికే ప్రభుత్వం 65 శాతం సబ్సిడీతో జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను అందజేసి వాటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తూ భూసా రం పెరిగేలా కృషి చేస్తున్నది. ఇలా చేయడంతో పంటల కు వినియోగించే ఎరువులో రెండు యూరియా బస్తాల వినియోగం తగ్గడంతో ఖర్చు ఆదా అవుతుంది.
ఈ ఏడాది పత్తికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒక దశలో క్వింటల్ పత్తి రికార్డు స్థాయిలో రూ. 14వేల వరకు పలికింది. రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం తో రైతులు పెద్ద ఎత్తున పత్తిని సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహిస్తుండటం, అధికారులు రైతులకు అన్ని రకాలుగా స హాయపడుతుండటంతో రైతులు మంచి లాభాలు గడి స్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దీంతో ఈ ఏడా ది సైతం పత్తి, కంది విస్తీర్ణాన్ని మరింత పెంచి మంచి ది గుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటూ రైతులు రెండు పంటలు పండించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
భూముల్లో రైతులు పంట దిగుబడులు సాధించాలనే ఆశతో బస్తాలకు.. బస్తాలు ఎరువులు వినియోగిస్తున్నా రు. దీంతో దిగుబడులు పెరుగుడు పక్కన పెడితే చీడ పీ డలు పెరుగుతూ పంటలను పాడు చేయడమే కాకుండా భూముల్లో భూసారం నశింపచేస్తున్నాయి. దీంతో అధికారులు ఎరువులను క్రమపద్ధతిలో వాడుతూ పెట్టుబడులు తగ్గించేలా కృషి చేస్తున్నారు. క్రమ పద్ధతిలో దఫ.. దఫాలుగా పంట కాలంలో మూడు, నాలుగుసార్లు చల్లుకున్నైట్లెతే పంటకు అవసరమైన మేర ఎరువులు వినియోగమవుతూ చీడ పీడల ఉధృతి తగ్గుతుంది. అంతే కాకుండా ఎరువులకు వెచ్చించే ఖర్చులు తగ్గి దిగుబడు లు పెరిగేందుకు ఆస్కారం ఉంది.
వరినాట్లు వేసే సమయంలో కూలీల కొరత వేధిస్తున్నది. వారికి చెల్లించే కూలీ ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. కొత్తగా నాట్లు వేసేందుకు వచ్చే వారికి తగిన నైపుణ్యం ఉండటం లేదు. దీంతో ఓ వైపు కూలీల కొరత మరో వైపు వారికి చెల్లించే కూలీల ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఒక్కోసారి సరైనా సమయానికి వరి నాట్లు వేయకపోవడంతో పంట దిగుబడులపై సైతం ప్రభావం చూపుతోంది. దీంతో నేరుగా విత్తనాలు వెదజల్లడం ద్వారా పెట్టుబడులు భారీగా తగ్గుతుండటంతో పాటు పంట కాలం సైతం తగ్గడంతో ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పంటల సాగులో ఎరువుల పాత్ర చాలా ముఖ్యమైనది. పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు రావాలంటే ఎరువుల వినియోగం తప్పనిసరి. ఇందులో ము ఖ్యంగా భాస్వరం చేసేపని అంత ఇంతా కాదు. డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువుల వలన భాస్వరం భూమిలోకి చేరుతున్నది. దీంతో పూర్తిస్థాయిలో ఎరువు లు పం టలకు ఉపయోగపడుతాయి. పంట ఏపుగా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వచ్చి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
రైతులు పంటల సాగు లో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నాం. అం దులో భాగంగా క్లస్టర్ల వారీ గా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా భూముల్లో భూసార శక్తిని పెంపొందించుకునేందుకు రైతులకు తగిన అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులకు ప్రభుత్వ పరంగా సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందజేశాము. రైతులు సూచనలు సలహాలు పాటిస్తూ రసాయన ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ ఎరువులు వాడితే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించడంతో పాటు భూసారం కోల్పోకుండా ఉంటుంది.
– అరుణ ఏడీఏ, జోగిపేట