మనోహరాబాద్/ చేగుంట, జూన్ 3 : ప్రజాశ్రేయస్సు కోసం పాటు పడుతూ, జనం మెచ్చిన నాయకుడిగా మంత్రి హరీశ్‌రావు నిలిచారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం నిర్వహిం చారు. కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ సు ధాకర్‌రెడ్డి, ఎంపీపీ నవనీత, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీలు లావణ్య, లతావెంకట్గౌడ్, సర్పంచ్‌లు మల్లేశ్, అర్జున్, నాగభూషణం, రేణుక, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, భిక్షపతి, మంగ్యానాయక్, నరేశ్ముదిరాజ్ పాల్గొన్నారు.
చేగుంట,నార్సింగి మండలాల్లో మంత్రి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. చేగుంటలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంగళ్రావు, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు సండ్రుగు స్వామి, జగన్‌గౌడ్, అంజగౌడ్, నగేశ్, సంతోశ్ కుమార్, సత్యనారాయణ, మహ్మద్ ఆలీ,రవి, నార్సింగిలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైల రాం బాబు, నాయకులు మల్లేశంగౌడ్, తౌర్యానాయక్, తాటి కొండ సిద్దు పాల్గొన్నారు. అనంతరం నార్సింగిలోని దవాఖానలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు.
మెదక్ మున్సిపాలిటీ/పాపన్నపేట, జూన్ 3 : మంత్రి పుట్టినరోజు పురస్కరించుకొని మున్సిపల్లో వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ సుమారు 70 మంది వృద్ధులకు చీరెలు పం పిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గం గాధర్, కౌన్సిలర్ గాయత్రి, మాజీ కౌన్సిలర్ కిషన్, నేతలు జీవన్‌రావు, ప్రసాద్, రమేశ్, కిరణ్, బాలరాజు, గోపాల్, నర్సింహులు, దశరత్ పాల్గొన్నారు.
పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా అమ్మవారి సన్నిధిలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.