పల్లెలకు మహర్దశ
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పల్లె ప్రగతి ఉపయోగపడుతుందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. కొల్చారం మండలం ఎనగండ్ల, ఏటిగడ్డ మాందాపూర్‌లో సోమవారం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పర్యటించి, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చాలా బాగుందన్నారు
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ‘పల్లె ప్రగతి’
సర్పంచ్ల పాత్ర ప్రశంసనీయం
అన్ని చోట్లా పనులు జోరుగా సాగుతున్నాయి
మెదక్ కలెక్టర్ హరీశ్
కొల్చారం మండలంఎనగండ్లలో పల్లె ప్రకృతి వనం పరిశీలన
ఏటిగడామాందాపూర్లో క్రీడాప్రాంగణం ప్రారంభం
కొల్చారం, జూన్ 20: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పల్లె ప్రగతి ఉపయోగపడుతుందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. కొల్చారం మండలం ఎనగండ్ల, ఏటిగడ్డ మాందాపూర్‌లో సోమవారం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పర్యటించి, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చాలా బాగుందన్నారు. పల్లె ప్రగతి పథకంతో ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయడంతో జోరుగా పనులు జరుగుతున్నాయన్నారు.
గ్రామాల్లో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల కల్పించారని, ఇక మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు మిగిలాయని అన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచ్ల పాత్ర ప్రశంసనీయమన్నారు. ఏటిగడ్డ మాందాపూర్‌లో క్రీడాప్రాంగణాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డిని అభినందించి, సన్మానించారు. అనంతరం క్రీడాప్రాంగణంలో మొక్కను నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, వీరారెడ్డి, ఆయా పంచాయతీల కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

