ఓపీ సేవలకే పరిమితం..!
ప్రజలకు నాణ్యమైన వైద్యా న్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలో రూ.34.22 కోట్లతో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన మాతాశిశు దవాఖానలో కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుతున్నాయి.
- గజ్వేల్లోని మాతాశిశు దవాఖానలో అందని ప్రసూతి సేవలు
- రూ.34.22 కోట్ల్లతో అందుబాటులోకి నూతన భవనం
- సామగ్రి లేక జిల్లా దవాఖానలో ప్రసూతి సేవలు
- రోగుల రద్దీతో ఇబ్బందులు
- మంత్రి దామోదర పట్టించుకోవాలని ప్రజల విజ్ఞప్తి
గజ్వేల్, జూలై 16: ప్రజలకు నాణ్యమైన వైద్యా న్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలో రూ.34.22 కోట్లతో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన మాతాశిశు దవాఖానలో కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుతున్నాయి. గర్భిణులకు ప్రతిరోజు ఓపీ సేవలను అందిస్తూ వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మించిన దవాఖానలో ప్రస్తుత ప్రభుత్వం వసతులు కల్పించకపోవడంతో పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. కేవలం ఓపీ సేవలకే పరిమితమవుతున్నది. గతేడాది అక్టోబర్లో అప్పటి రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మాతాశిశు దవాఖానను ప్రారంభించారు. దవాఖాన ప్రారంభించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రసూతి సేవలు అందుబాటులోకి రాలేదు. మాతాశిశు దవాఖానను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడానికి అధికారులు పట్టించుకోవడం లేదు. నూతన దవాఖానలో ఓటీ, లేబర్రూంలో కావాల్సిన పరికరాలు పూర్తిస్థాయిలో సమకూర్చలేదు.
దీంతో ప్రసూతి సేవలకు గజ్వేల్లోని జిల్లా దవాఖానకు వెళ్లక తప్పడం లేదు. ప్రసూతి వైద్యం కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉండాలనే ఉద్దేశంతో నిర్మించిన మాతాశిశు దవాఖానలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు శ్రద్ధ్ద చూపడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖానలోనే ప్రసూతి వైద్యం అందిస్తున్నారు. ప్రతినెలా జిల్లా దవాఖానలో 300 పైచిలుకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇదే దవాఖానకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి గర్భిణులు పరీక్షల కోసం వస్తున్నారు. దీంతో దవాఖానలో రద్దీ ఎక్కువగా ఉంటున్నది. నూతనంగా నిర్మించిన మాతాశిశు దవాఖానలో సరిపడా పరికరాలను సమకూర్చడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉమ్మడి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో మాతాశిశు దవాఖానను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
మాతాశిశు దవాఖానలో కావాల్సిన పరికరాల కోసం ఇప్పటికే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పరికరాలను అందజేసేందుకు సుముఖత చూపించారు. ఈ నెలాఖరులో ప్రసూతి దవాఖానలో సరిపడా పరికరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
-సాయికిరణ్, సూపరింటెండెంట్ గజ్వేల్ ఎంసీహెచ్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

