కాంగ్రెస్‌లో గూడెం సెగ
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
- మహిపాల్‌రెడ్డి చేరికపై కాటా అసంతృప్తి
- మింగుడపడని అధిష్టానం నిర్ణయం
- కాటా, మహిపాల్‌రెడ్డి మద్దతుదారుల మధ్య సోషల్ వార్
సంగారెడ్డి జూలై 16(నమస్తే తెలంగాణ): పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన మహిపాల్‌రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీముఖ్యం గా కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. అందుకే మహిపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక కార్యక్రమానికి కాటా శ్రీనివాస్‌గౌడ్ దూరంగా ఉన్నారు. కాటా వర్గానికి చెందిన నాయకులు బాహాటంగానే మహిపాల్‌రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారు.
ఈ విషయమై కాటా, మహిపాల్‌రెడ్డి అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా రెండురోజులుగా వార్ కొనసాగుతున్నది. రెండురోజులుగా కాటా తన అనుచరులు, మద్దతుదారులతో కీలక చర్చలు జరుపుతూ తన భవిష్యత్ రాజకీయ విషయమై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నా రు. ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ సైతం మహిపాల్‌రెడ్డిని ఇబ్బందులుకు గురిచేసే ప్రయత్నం చేసింది. మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నడుపుతున్న క్రషర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరిపిందని కేసు నమోదు చేయటంతోపాటు ఆరెస్టు చేసింది. ఆ సమయంలోనే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం సాగింది. అయితే మంత్రి దామోదర రాజనర్సింహ మహిపాల్‌రెడ్డి చేరికను అడ్డుకున్నట్లు తెలిసింది. పటాన్చెరులో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాటా శ్రీనివాస్‌గౌడ్ సైతం మహిపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని వ్యతిరేకించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

