మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
- గణేశ్‌పూర్ శివారులో బీదర్-జహీరాబాద్ రోడ్డుపై ఆందోళన
జహీరాబాద్, అక్టోబర్ 8: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు. గ్రామ సమీపం గుండా వెళ్లే జహీరాబాద్-బీదర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే కర్ణాటక డిపో బస్సును అడ్టుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.
జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ ఎస్ఐ రామానాయుడు హుటాహుటినా సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన కర్ణాటక డిపోకు చెం దిన అధికారులు, సిబ్బంది వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదం టూ ఆందోళనకారులు భీష్మించుకుని కూర్చున్నారు. కర్ణాటక డిపో ఆధికారులతో జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు మాట్లాడారు.
జహీరాబాద్, బీదర్ ఆర్టీసీ అధికారులను హద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు రప్పించి గ్రామస్తులు, మృతుల కుటుంబాల సమక్షంలో మా ట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, ఆందోళనలతో కర్ణాటక డిపో బస్సులను దారిమళ్లించారు. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, టీఎస్ఐఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శివాజీపాటిల్, చంద్రప్ప, ఓంకర్, మల్లప్ప, గౌసోద్దీన్, శివశరణప్ప, వెంకట్‌రెడ్డి తదితరులు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించా రు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. తాత, అమ్మానాన్న, తమ్ముడు మృతి చెందడందో అనాథలుగా మిగిలిన ముగ్గురు అక్కాచెల్ల్లెళ్లను పట్టుకుని బంధువులు విలపించారు. బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల ప్రజ లు ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు మంజూరై ఏండ్లు గడుస్తున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

