ఆత్మరక్షేణే ఆయుధం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశాలల్లో కరాటే నేర్పిస్తున్నారు.
- బాలికల కోసం ప్రభుత్వం మరో ముందడుగు
- ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ
- ఉచిత కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం
- నెల రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ
- ఉచిత శిక్షణతో విద్యార్థినులకు ప్రయోజనం
గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశాలల్లో కరాటే నేర్పిస్తున్నారు. ఉచిత కరాటే శిక్షణ తరగతులు ఇటీవల ప్రారంభమయ్యాయి. సాయంత్రం సమయంలో రోజూ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. బాలికలపై తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న అఘాయిత్యాలను చూసి తల్లిదండ్రులు బాలికల రక్షణపై దిగులు పడుతున్న సమయంలో ప్రభుత్వం బాలికలకు రక్షణగా కరాటే శిక్షణ ఇప్పిస్తున్నది. పాఠశాలల్లో చదువుకునే బాలికలకు శిక్షణ ఇప్పిస్తుండడంతో తల్లిదండ్రుల్లో ధైర్యం వచ్చింది. తమ పిల్లలు ఎలాంటి సంఘటనైనా ఎదుర్కొంటారనే నమ్మకం వారిలో కలిగింది.
ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సర్కార్విద్యపై గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత నమ్మకం పెరుగుతోంది. సిద్దిపేట జిల్లాలోని 225 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు ఇటీవల ఉచిత కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించగా నెల రోజులు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో అనుభవజ్ఞులైన కరాటే శిక్షకుల ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు పాఠశాలలను అప్పగించడంతో రోజూ శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణలో బాలికలకు ఎదుటి వారి నుంచి ఎదురయ్యే సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో, వారి నుంచి తమకు తాము ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో ప్రధానంగా నేర్పిస్తున్నారు. నెల రోజులు రోజూ గంటసేపు బాలికలకు ఆత్మరక్షణపై మెళకువలు నేర్పించి శిక్షణ ఇస్తున్నారు. చాలా ప్రాంతాల్లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులు ఇతర గ్రామాల నుంచి పక్కనే ఉండే జడ్పీ పాఠశాలలకు కాలినడకన వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగినా వాటిని అధిగమించి తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా కరాటే దోహదపడుతుంది. జిల్లాలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులను విద్యాశాధికారులు తనిఖీలు చేస్తున్నారు.
బాలికలకు మనోధైర్యం వస్తుంది
కరాటే నేర్చుకుంటున్న బాలికల్లో మనోధైర్యం వస్తుంది. తమ ఎదుట ఎలాంటి సంఘటనలు జరిగినా వాటిని ఎదుర్కొనే విధంగా శిక్షణలో మెళకువలు నేర్పిస్తున్నాం. నెల రోజులు ఇచ్చే శిక్షణతో బాలికల్లో కరాటేపై నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థినులు కరాటే శిక్షణలో పాలుపంచుకుంటున్నారు. శిక్షణ తరగతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి.
– బి.నరేశ్, కరాటే శిక్షకుడు
కరాటేతో ప్రయోజనం
జీవితంలో మర్చిపోలేని కరాటేను తమ రక్షణ కోసం ప్రభుత్వం నేర్పించడం చాలా బాగుంది. కరాటేతో తమకు తాముగా ఎదుటి వారిని ఎదుర్కొంటామనే నమ్మకం మాలో కలుగుతుంది. తరచూ బాలికలపై దాడులు జరుగుతున్నాయి. అప్పుడు తమకు పాఠశాలలో నేర్చుకున్న కరాటే ఎంతగానో ఉపయోగపడుతది. చాలామందికి కరాటేపై అవగాహన వచ్చే విధంగా తెలియజేస్తాం.
– అనూష, తొమ్మిదో తరగతి, విద్యార్థిని
కరాటే శిక్షణ తరగతులు బాగున్నాయి

మా పాఠశాలలో గత కొద్ది రోజులుగా కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణ తరగతుల ద్వారా శిక్షకులు చెబుతున్న విధంగా కరాటే నేర్చుకుంటున్నాం. కరాటే శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపతున్నది. అందరూ ఇష్టంగా కరాటే నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం మంచి ఆలోచనతో మా కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
– వి.కావ్య, తొమ్మిదో తరగతి, విద్యార్థిని
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

