మెదక్: జూనియర్ కళాశాల ప్రవేశాల్లో జిల్లాలోనే ప్రథమం

మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్య సంవత్సరానికిగాను మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాటికి 407 ప్రవేశాలు దాటయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా ప్రవేశాలు జరిగి జిల్లాలోనే కళాశాల ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు పెంచినందున ఇంకా ప్రవేశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, అడ్మిషన్ ఫీజులు మాఫీ లాంటి ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్, నేషనల్ గ్రీన్ కాప్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ వంటి సేవా కార్యక్రమా లు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు టీషాట్, డీడీ యాదగిరిలో ఆన్లైన్ తరగతులతో పాటు అధ్యాపకు లు
ప్రతిరోజు జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారరంభిస్తే కొవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ కళాశాలను నడిపిస్తామన్నారు. ఈ సందర్బంగా కళాశా లలో ప్రవేశాలు పొందిన పలువురు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

