చిలిపిచెడ్ కరువు మండలంగా ప్రకటించాలి : జూల అనిల్
చిలిపిచెడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చిలిపిచెడ్ సర్పంచ్ జూల అనిల్ డిమాండ్ చేశారు.
చిలిపిచెడ్, నవంబర్ : 2 చిలిపిచెడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చిలిపిచెడ్ సర్పంచ్ జూల అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండల ప్రజావాణిలో దరఖాస్తు చేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ.. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో.. వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందన్నారు.ఇప్పటికే బోర్లలో నీళ్లు రాక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో చిలిపిచెడ్ మండలంను కరువు మండలంగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. చిలిపిచెడ్ మండలం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని, ఈ ప్రాంత రైతులకు వ్యవసాయం తప్ప మరో ప్రధాన జీవనాధారం లేదని పేర్కొన్నారు. తలాపున మాంజీర నది ఉన్నా ఫలితం లేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా చిలిపిచెడ్ మండలంలోని లంబాడీ తండాల్లో నివసించే గిరిజన కుటుంబాలు, గౌతాపూర్, సోమక్కపేట, రాందాస్ గూడా, తదితరు గ్రామాలను వ్యవసాయ కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రస్తుతం కూలీ పనులు కూడా దొరకక వారి జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెదక్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చిలిపిచెడ్ మండలం ను కరువు మండలoగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూర్ సర్పంచ్ శేషాద్రి, నాయకులు అంకం యాదగిరి, విట్టల్, వెంకటేశం, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

