సర్కార్‌పై భగ్గుమన్న జర్నలిస్టులు.. జీవో 252ను వెంటనే సవరించాలని డిమాండ్
జర్నలిస్టుల హకులు కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే(హెచ్ 143) జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు
- సిద్దిపేట కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌కు వినతి
సిద్దిపేట కమాన్, డిసెంబర్ 27: జర్నలిస్టుల హకులు కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే(హెచ్ 143) జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మానుకోవాలని శనివారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా బాధ్యులు గందె నాగరాజు, నాయకులు నిమ్మ అశోక్, గజ్వేల్ ఇన్చార్జి నవీన్, హుస్నాబాద్ నాయకుడు కళాచందర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో 23 వేల అక్రెడిటేషన్లు ఇచ్చారని, కొత్త జీవో వల్ల 10వేలకు పైగా కోత పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయి లో రిపోర్టర్లకు కార్డు ఉండేదని, ఇప్పుడు రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడు ఆకోటా రద్దుచేసి ఫ్రీలాన్స్ కోటాలో కార్టూనిస్టులకే పరిమితం చేశారన్నారు.
దీనిపై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్‌కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్ విద్యార్హత చేశారన్నారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50 వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ చొప్పున ఇచ్చారని, కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తామని ఆ జీవోలో పేరొనడం సరికాదన్నారు. కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులు రద్దు చేశారన్నారు. కార్యక్రమంలో కట్ట నవీన్, సంపత్, పోతుల మల్లేశ్, కరుణాకర్, శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

