Goli Soda | కనుమరుగైన గోళీ సోడా.. కొంగొత్తగా మార్కెట్లోకి.. సమ్మర్లో పెరిగిన డిమాండ్
Goli Soda | ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్‌గా మారిపోతుంది. గోళీసోడా కొత్త రకంతో మార్కెట్లోకి వచ్చేసింది. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా తయారు చేసి, మార్కెట్లోకి తీసుకురావడంతో అందరూ వాటిని ఆస్వాదించడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
Goli Soda | మద్దూరు(ధూళిమిట్ట) : ఓ సినిమాలో ‘నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ’ అనే పాట ఎంత ట్రెండ్ సృష్టించిందో అందరికీ తెలిసిందే! అచ్చం అలానే అనేక సంవత్సరాలు గోళీ సోడా ఒక ఊపు ఊపింది. అది తాగితే గానీ ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు.. పొట్టషేర్లు పట్టేసినట్లు.. అన్నం అరగనట్టు.. తేన్పు రాలేనట్టు.. ఇలా ఏ ఫీలింగ్ అనిపించినా ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నంటికీ సమాధానం చెప్పేది! ఇప్పుడా గోళీ సోడా ఖాళీ అయ్యింది. రోజుకో రకం సోడా మెషీన్లు అందుబాటులోకి రావడంతో గోళీ సోడాలు కనుమరుగయ్యాయి. కానీ, అదే సోడా కొత్తదనంతో పునర్దర్శమిచ్చింది!
మారుతున్న వ్యాపారానికి అనుగుణంగా రంగులద్దుకుని కొంగొత్త పోకడలు పోతూ మార్కెట్లో కనిపిస్తోంది!! గతంలో ప్రత్యేకంగా తయారు చేసిన గాజు సీసా తయారీలోనే గోళీ ఉండేది. దానిపై రబ్బరు వాచర్ ఏర్పాటు చేసి సగం వరకూ నీళ్లు పోసి మెషీన్ ద్వారా గ్యాస్ ఎక్కించి, సోడా తయారు చేసేవారు. దీనికి ఒక వ్యక్తి పూర్తిస్థాయిలో కష్టపడాల్సి వచ్చేది. మెషీన్‌పై సోడాలు తయారు చేయడం కొన్ని సమాయాల్లో ప్రమాదాలకు దారి తీసేది.
రానురానూ కొత్త రకం యంత్రాలు అందుబాటులోకి రావడంతో సోడాతో పాటు డ్రింక్‌లు సైతం నిమిషాల్లో తయారవుతున్నాయి. గతంలో వచ్చిన యంత్రాలు (సోడాహబ్లు) సీసాలతో పని లేకుండా కేవలం గ్లాసులు మాత్రమే ఉపయోగించడంతో ఎలాంటి ప్రమాదాలు లేకపోగా, త్వరితగతిన తయారువుతుండడంతో ఎక్కువ మంది వాటిపై మొగ్గు చూపారు. దీంతో అప్పటి వరకూ అందుబాటులో ఉన్న గోళీ సోడా కనుమరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో కీచ్‌మంటూ శబ్దాలు వినిపించగానే గోళీ సోడా తాగుతున్నారనుకొనేవారు. ప్రత్యేకంగా తయారు చేసిన బండ్లపై సోడాలు అమ్ముతూ అనేక మంది ఉపాధి పొందేవారు. ప్రస్తుతం వారందరూ కనిపించకుండాపోయారు. వారి స్థానంలో కొత్త ట్రెండ్‌లో వచ్చిన గోళీ సోడాలు ప్రస్తుతం బేకరీలు, హోటళ్లు, కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నారు.

Goli Soda1
గోళీ సోడాలకు భలే గిరాకీ
ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్‌గా మారిపోతుంది. గోళీసోడా కొత్త రకంతో మార్కెట్లోకి వచ్చేసింది. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా తయారు చేసి, మార్కెట్లోకి తీసుకురావడంతో అందరూ వాటిని ఆస్వాదించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. పూర్వం పది పైసల నుంచి ప్రారంభమైన గోళీ సోడాలు రూ.1 వరకూ అమ్మకాలు జరుగగా, ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్లాస్టిక్ రంగుల సోడా సీసా ధర రూ.10కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో ఎక్కువ మంది గోళీసోడాలను తాగేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.
ఆ గోళీ సోడా టేస్టే వేరు..
మార్కెట్లోకి ఎన్ని కూల్‌డ్రింక్‌లు వచ్చినా గోళీ సోడా టేస్టే వేరు. గోళీ సోడా సీసాను ఒక్కసారి దమ్ముపడితే దాహం తీరేది. ఇన్ని రోజులు గోళీ సోడాలు కనిపించలేదు. ఇప్పుడిప్పుడే దుకాణాల్లో మళ్లీ కనిపిస్తున్నాయి. మునుపటంత టేస్టు లేకున్నా గోళీ సోడా తాగిన ఫీలింగైతే వస్తుంది. ఎండాకాలంలో కూల్‌డ్రింక్స్ కన్నా గోళీ సోడానే నయం.
– దామెర భిక్షపతి,ఆర్టీసీ, రిటైర్డు డ్రైవర్, మద్దూరు
గోళీ సోడాలే బాగా అమ్ముడుపోతున్నయి..
ఎండాకాలంలో జనం సోడాలను బాగా తాగుతున్నారు. ఇతర కూల్‌డ్రింక్స్ కన్నా ఎక్కువగా గోళీ సోడాలే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ప్రధానంగా కూలీలు, రైతులు, యువకులు గోళీ సోడాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. మా షాపులో రోజుకు వందల సంఖ్యలో గోళీ సోడాలు అమ్ముడుపోతున్నాయి.
– మహ్మద్ అన్వర్ అలీ, కూల్‌డ్రింక్స్ షాపు యాజమాని, మద్దూరు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

