స్పెషల్ పేరిట బాదుడు
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది. స్పెషల్ బస్సుల పేరిట బోర్డులు తగిలించి ముకుపిండి అధిక చార్జీలు వసూలు చేస్తున్నది. అధిక చార్జీలు పెట్టి కూడా దూర ప్రాంతాలకు నిలబడి పోవాల్సి వస్తున్నదని పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పండుగ వేళ భారీగా టికెట్ చార్జీలు వసూలు
- జేబీఎస్ నుంచి మెదక్‌కు రూ.240
- ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్న ఆర్టీసీ
మెదక్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది. స్పెషల్ బస్సుల పేరిట బోర్డులు తగిలించి ముకుపిండి అధిక చార్జీలు వసూలు చేస్తున్నది. అధిక చార్జీలు పెట్టి కూడా దూర ప్రాంతాలకు నిలబడి పోవాల్సి వస్తున్నదని పురుష ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి అవసరమైన మేరకు బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ పేరిట ఛార్జీల మోత…
మెదక్ జిల్లాలోని డిపోల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులకు సంక్రాంతి స్పెషల్ పేరిట బోర్డులు తగిలించి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి నుంచి నడిపిస్తున్న కొన్ని బస్సులకు దూర ప్రాంతాల బోర్డులు వేసి స్పెషల్ పేరుతో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. జేబీఎస్ నుంచి మెదక్‌కు స్పెషల్ బస్సులు నడుపుతూ ప్రయాణికుల వద్ద అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల నుంచే తమకు ఆదేశాలు ఉన్నాయంటూ దబాయిస్తున్నారు.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో జనం పల్లెలకు వస్తుంటారు. ఇదే అదనుగా భావించిన ఆర్టీసీ అధికారులు రెగ్యులర్‌గా నడిపించే బస్సులకే దర్జాగా సంక్రాంతి స్పెషల్ బోర్డులు తగిలించి అధిక చార్జీలు వసూలు చేసి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఆదివారం జేబీఎస్ నుంచి మెదక్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులో డ్రైవర్‌తో ప్రయాణికులు ఘర్షణకు దిగారు. మెదక్ డిపో నుంచి సంక్రాంతి స్పెషల్‌గా ఎక్స్‌ప్రెస్ బోర్డుతో వచ్చిన టీఎస్ 35 జెడ్ 0022 నెంబర్ గల బస్సు ఉదయం 7:30కు మెదక్ డిపోకు చెందిన బస్సు జేబీఎస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జేబీఎస్లో ఆ బస్సు ఎకిన ప్రయాణికులతో డ్రైవర్ టికెట్ ఇచ్చి అధికంగా వసూలు చేశాడు. జేబీఎస్ నుంచి మెదక్‌కు రూ.160 చార్జి కాగా, అదనంగా రూ.80 వసూలు చేసి రూ.240 టికెట్ ఇచ్చాడు. అక్కడే ఉన్న మెదక్ డిపో మేనేజర్‌ను ఇదేమిటని అడుగగా, సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ పేరిట చార్జీలు వసూలు చేస్తున్నామని సమాధానమిచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

