జహీరాబాద్, ఫిబ్రవరి 5: జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రారంభించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డు పై ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే మాణిక్‌రావుతో పాటు సినీ తారలు హనీరోజ్, మెహరీన్ జ్యోతివెలిగి ప్రారంభించారు. తెలుగు రాష్ర్టాలో 60వ చందన్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అని నిర్వాహకులు తెలిపారు. సినీ తారలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.