మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో సాబర్ డైరీ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న సాబర్ డెయిరీ తెలంగాణ ప్రాజెక్టు భూమిపూజకు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అధికారులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాబర్ డెయిరీ ప్రాజెక్టు ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమకు ఊతం లభించడంతో పాటు, పాడి రైతులకు మార్కెట్ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.