సత్తాచాటిన పేదింటి దివ్వెలు
పట్టుదల ఉంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదు. పేద కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు మహిళలు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు.
పట్టుదల ఉంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదు. పేద కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు మహిళలు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు.
పీహెచ్డీ చేస్తూ ఐదు ఉద్యోగాలకు ఎంపిక
గజ్వేల్, మార్చి 2: ఒకేసారి ఐదు గురుకుల ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరిచే శభాష్ అనిపించుకుంది గజ్వేల్ పట్టణానికి చెందిన అమరవాది పావని, రాజశేఖరశర్మ దంపతుల ఏకైక కుమార్తె మృణాళిని. ఈమె ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రావి సీతాదేవి రామాయణం పద్యకావ్యంపై పీహెచ్డీ చేస్తున్నది. పీహెచ్డీ చేస్తూనే టీఆర్ఐఆర్బీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసింది. తెలుగులో ప్రవీణ్యం ఉండడంతో బీఈడీలో తెలుగు మెథడ్‌తో పాటు సాంఘికశాస్ర్తాన్ని పూర్తి చేసుకుంది. తెలుగు, సాంఘికశాస్త్రం రెండింటికీ అర్హత ఉండడంతో గురుకుల టీఆర్టీలో తెలుగు, సాంఘికశాస్త్రం రెండు పరీక్షలు రాయడంతో రెండింటికీ ఎంపికైంది. వీటితో పాటు ఇటీవల విడుదలైన గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్, గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్, గురుకుల పీజీటీ ఫలితాల్లో ప్రతిభ చూపడంతో పాటు ఆ మూడు ఉద్యోగాలకు ఎంపికైంది. డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా విధుల్లో చేరుతానని తన ఆసక్తిని మృణాళిని తెలిపింది. మృణాళిని తండ్రి రాజశేఖర్ శర్మ వర్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మృణాళినిని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.
సుస్మితకు మూడు ఉద్యోగాలు
మర్కూక్, మార్చి 2: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటకు చెంది న వివాహిత సుస్మిత గురుకుల విద్యాలయాల ఫలితాల్లో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించి సత్తా చాటింది. టీజీటీ, పీజీటీ, జేఎల్ ఉద్యోగాలకు ఎంపికైంది. సుస్మిత తూప్రాన్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ వాగ్ధేవి జూనియర్ కళాశాల తూప్రాన్‌లో పూర్తిచేసింది. డిగ్రీ గజ్వేల్‌లోని గీతాంజలి కళాశాల, పీజీ హైదరాబాద్‌లో పూర్తిచేసింది. ఈ మూడు కొలువుల్లో జేఎల్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఒక్క సర్కారు కొలువు సాధించడమే కష్టంగా ఉన్న ఈ పోటీ ప్రపంచంలో సుస్మిత ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించడంతో కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.
రేణుకకు మూడు ఉద్యోగాలు
మెదక్ రూరల్, మార్చి 2: మెదక్ మండలంలోని మంబోజిపల్లికి చెందిన నల్ల రేణుక మూడు సర్కారు ఉద్యోగాలు సాధించి సత్తాచాటింది. ఇటీవల వెలువడిన జూనియర్ లెక్చరర్, పీజీటీ స్పెషల్ టీచర్, టీజీజీ టీచర్ ఉద్యోగాలకు ఎంపికైంది. చేగుం ట కేజీబీవీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమై లక్ష్యాన్ని సాధించింది. రేణుకది గ్రామీణ ప్రాం తానికి చెందిన వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు నల్ల సత్తయ్య, ఆశ ఆమెను కష్టపడి పీజీ వరకు చదివించారు. ఎంకాం, బీఈడీ పూర్తిచేసింది. ఏడేండ్ల క్రితం వివాహం చేసుకున్నది. భర్త హైదరాబాద్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈమెకు ఒక పాప ఉంది. రేణుకను కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

